జాతీయస్థాయిలో పేట విద్యార్థుల ప్రతిభ

 శాంతా-వసంతా ట్రస్ట్ వారి సౌజన్యంతో   బాలల సాంస్కృతి కోత్సవాన్ని పురస్కరించుకునితెలంగాణ సారస్వత పరిషత్  హైదరాబాద్ లో
 విద్యార్థులకు జాతీయ. స్టాయిలో వివిధ పోటీలను నిర్వహించి, విజేతలను ఎంపికచేశారు.  ఇందులో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ,రాజగోపాల్ పేటకు చెందిన  విద్యార్థులు    మొత్తం  7 బహుమతులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు
 చిత్రలేఖనం లో ఖాత నందిని  తృతీయ బహుమతి1000/,గౌరబోయిన సాహిత్య ప్రోత్సాహక బహుమతి500/ పుస్తక సమీక్షలో బండి వర్ష  ప్రోత్సాహక బహుమతి500/పద్య కవితలో కిర్నివినీత్ ప్రోత్సాహక బహుమతిని 500/ గెలుచుకున్నారు.అప్పటికప్పుడే అంశాలను ప్రకటించి మరికొన్ని  (వ్యాసరచన,వక్తృత్వ పోటీలను,పుస్తకసమీక్ష  ,పాటల)  
పోటీలను నిర్వహించగా...
వ్యాసరచన పోటీలో రంగు మేఘన ద్వితీయ బహుమతి1500/ ,అనంతొజు రమ్య  తృతీయ బహుమతి 1000/పుస్తకసమీక్ష లో  కిర్ని వినీత్ తృతీయ  బహుమతి1000/ గెలుచుకున్నారు.ఆదివారం  జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు డాక్టర్. చెన్నయ్యగారు,గరిపల్లి అశోక్ గారుఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు వరప్రసాద్  రెడ్డి గారు  , డాక్టర్.కె  వి. రమణాచారిగారు   గారు, డాక్టర్ పత్తిపాక. మోహన్ గారలు నగదు బహుమతిని,మెమొంటో, సర్టిఫికెట్స్ తో  విద్యార్థులను సన్మానించారు..ఈ  సందర్భంగా
పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ.కనకయ్య గారు ,  పాఠశాల సిబ్బంది బీరకాయలతిరుపతి,మురళి కృష్ణ ,బాలాంజనేయులు ,సతీష్,శంకర్,
శ్రీనివాస్ రెడ్డి,ఖాదర్ బాబా,
జ్యోతి,అరుణ ,అమ్మ ఆదర్శకమిటీ  చైర్ పర్సన్  గారలువిజేతలైన విద్యార్థులను ,వీరికి శిక్షణ ఇచ్చిన తెలుగుఉపాధ్యాయిని 
శివునూరి లలితను  అభినందించారు.
కామెంట్‌లు