భూజాన సంచి వేసుకుని
ఎనిమిది పదుల వయస్సులో కూడా
అలుపెరుగక కథల సేకరణకై
నిరంతరం తపనపడే కాళీపట్నం రామారావు గారు
జీవితం నేటి కథకులకు ఆదర్శం.
అధ్యాపక వృత్తిలో చదువుతోబాటు
నైతికవిలువలను తాను పాటించి
విద్యార్థులకు చెప్పిన సరస్వతీ పుత్రులు..
సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను
తన కథలలో నిర్మొహమాటంగా వ్రాసిన
ప్రజాకవి
.
సామాజిక స్పృహ కలిగిన 'యజ్ఞం 'నవలకు లభించిన
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార పారితోషకంను
ప్రభుత్వ విధానాలు నచ్చక నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సాహితీవేత్త.
తన స్వప్న సౌధమైన కథానిలయం కోసం
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తో బాటు సాహిత్యం ద్వారా వచ్చిన ధనంతో
ఏడుపదుల వయస్సులో సాకారం చేసుకున్న కథాప్రేమికుడు.
రచయితలో చిన్నా, పెద్ద అని ఉండదని
ప్రతికథలో రచయిత ఆనాటి సమాజ స్థితి ఉంటుందని
కథలను సేకరించి విశ్వనాథ, రావి శాస్త్రి,కొడవటిగంటి కుటుంబరావు తైలచిత్రాలతోబాటు రచయితల ఫోటోలను కథానిలయంలో పెట్టి
ఎన్నో, ఎన్నెన్నో కథలను సేకరించిన కథాప్రేమికుడు.
ప్రముఖ నవలా రచయిత యండమూరి నాకు ప్రేరణ, గురువు కాళీపట్నం రామారావు గారు అని చెప్పడం వారి ఔన్నత్యాన్ని గుర్తించడమే.
కథానిలయం ఉత్తరాంధ్రకే కాదు దేశ విదేశాల తెలుగు భాషాభిమానులందరికి
పవిత్ర సరస్వతి మందిరం.
కథానిలయం ద్వారా కా రా మాష్టారు సదా స్మరణీయులు
ఎప్పుడు ఆప్యాయంగా పలకరించే కాళీపట్నం రామారావు గారి కివే
నా అక్షరాంజలులు...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి