ధర్మరాజు గొప్పతనం! అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండవుల్లో కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు అని అందరికీ తెలుసు.ఆయన గొప్పతనం భారతమంతా కన్పడ్తూనే ఉంటుంది.కొన్ని విషయాలు అంతగా తెలీవు అందరికీ.ఇవి చదివితే ధర్మరాజు విశాల హృదయం అవగతం అవుతుంది.యుద్ధంలో కొడుకులంతా చనిపోయారు.యుధిష్ఠిరునికి పట్టాభిషేకం జరిగింది.గాంధారి ధృతరాష్ట్రులు అతనిదగ్గరే ఉన్నారు.పెదతండ్రి ఆమోదంపొందే రాజ్య పాలనచేసిన ధర్మమూర్తి ఆయన. కుంతి ద్రౌపదితో సహా ఆవృద్ధులసేవ చేశారు.ఆఖరున వనవాసం వెల్తామని ఆవృద్ధదంపతులు బైలుదేరితే నేనూవస్తా అని పయనమైనాడు. అప్పుడు వ్యాసుడువచ్చి ఎంతో నచ్చజెప్పాక తల్లికుంతికూడా ఆవృద్ధులసేవ కై బైలుదేరితే ఏమనలేక ఊరుకున్న మెత్తటి మనిషి ధర్మరాజు.ధృతరాష్ట్రుడు కోరినట్లు కావల్సిన ధనాన్ని సంపదను రత్నాలను ఇచ్చిన ఆయన దాతృత్వం ఎన్నదగినది.యాదవనాశనం శ్రీకృష్ణ నిర్యాణంతోవిరక్తితో  పరీక్షిత్తుకి పట్టాభిషేకంచేసి కృపాచార్యుడు, యుయుత్సుని బాసటగా ఉంచి ద్రౌపది తమ్ముళ్లతో  హస్తినాపురంనుండి బైలుదేరాడు. హిమాలయాలదాటి మేరుపర్వతం దిక్కున సాగిపోయారు. ద్రౌపది తమ్ముళ్లు  నేలకూలారు.వారిని పట్టించుకోకుండా ధర్మ రాజు ముందుకు సాగితే ఇంద్రుడొచ్చి రథం ఎక్కమన్నాడు. "నీవారంతా స్వర్గం చేరారు ధర్మ నందనా!!" అనగానే రధారోహణం చేశాడు.కుక్క రూపంలో ధర్మ దేవత ఆయన వెన్నంటివచ్చింది. బొందితో స్వర్గానికెళ్లాడని నారదడు స్తుతించాడు.కాసేపు నరకదృశ్యాల్ని చూశాడు. ఆపై కృష్ణ దర్శనం జరిగాక తనతండ్రి ధర్మ దేవునిలో లీనమైనాడు ధర్మరాజు.ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సకాలవర్షాలు వేదధ్వని విన్పడేది.అజగరరూపంలో ఉన్న నహుషుడు ధర్మరాజుని దర్శనంతో శాపవిముక్తుడైనాడు.ధర్మోవివర్ధతి యుధిష్ఠిరకీర్తనేన🌷
కామెంట్‌లు