ఓ మహిళా మణి....
తాళి కట్టించు కుని...
నీ వు ఇల్లాలి వై...
తల్లివై....
ఒక యింటికి దీప కాంతిగా...
నీ సేవలతో... ఆ గృహాన్ని తరింప జేసి నపుడే...
నీ జన్మకు సార్ధ కత..!
నీకు గుర్తింపు, గౌరవము గృహినిగానే... !
నీ సంక్రమ బాధ్యతా నిర్వహణ లోనే, నీ హక్కు ఇమిడి యున్నది..!!
నీ సద్గుణ ప్రవర్తనే...
ఆ పురుషుని మర్యాద
నీవు లేని యింటికి కళ , కాంతు లుండునా...?!
నీ సేవా భాగ్యమునకు నోచుకున్న ఇల్లే స్వర్గసీమ
ఇంటిని అత్యంత సుందరంగా అలంకరించి అహ్లాదాన్ని ఆనందాన్నీ పంచెదవు...!
నీ చేతి వంటతో...
మధుర రుచు లందించెదవు!
అటు పిల్లలనే కాదు ఇటు భర్తనూ... తల్లివలె సాకెదవు !!
సేవలతో దాసివై, మంచి సలహాల మంత్రివై, భర్తకు అండ, దండ వయ్యెదవు !
ఆ దేవతలకు మల్లె నీ వును అష్ట భుజివే !
పనులన్నిటినీ అవలీలగ చేయ గల దానవు !
సహానమున నీవు సాక్షా త్భూ మాతవే నమ్మా..!!
ఇల్లాలే ఈ జగతికి జీవన
జ్యోతి యని, కవులచే కొని యాడ బడిన దానవు...!
ఈ జగమున నీతో పోటీ పడగల వా రెవరూ లేరు తల్లి...!
నీ కు నీ వే సాటి...!
జయహో గృ హిణి !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి