పాలఖండ్యాంలో సామూహిక వందేమాతరం గీతాలాపన

 వందేమాతరం రచన ఉద్భవించి నూట ఏభై సంవత్సరాలైన సందర్భంగా 
పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ఆధ్వర్యాన గ్రామంలో సామూహిక వందేమాతరం గీతాలాపన గావించారు.  
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు, విద్యార్థులు, గ్రామపెద్దలతో పాటు సామూహికంగా వందేమాతరం ఆలపించి, వందేమాతరం అంటూ నినదిస్తూ అందరిలో దేశభక్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా కుదమ తిరుమలరావు 'రగిలే జ్వాల భక్తి భావ సుమ మాల' అనే స్వీయకవితను వినిపించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దూబ రంజిత్, వీఆర్వో శొంఠ్యాన దుర్గయ్య, సచివాలయం ఉద్యోగులు బాస నాగరాజు, ముంతా హరీష్, వర్దనపు అనిగ్రేస్, వండాన శారద, కుప్పిలి లక్ష్మీనారాయణమ్మ, సింగూరు రాము, మెండి నాగరాజు, గ్రామ పౌరులు పాల్గొన్నారు. 
బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం నూట యాభయ్యో జయంతిని పురస్కరించుకొని 'వందేమాతరం వందేభారతం' అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన బత్తుల లిఖిత, శనగల సురేష్ లకు బహుమతులను అందజేశారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు