రాజు బాధ్యత : - సరికొండ శ్రీనివాసరాజు

 ధర్మపురి సామ్రాజ్యానికి రాజు అయిన సుదర్శనుడు చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తరువాత తన కుమారుడు అయిన విజయునికి పరిపాలన బాధ్యతలు అప్పగిస్తాడు. ఒకరోజు వృద్ధ మంత్రి అయిన మహేంద్రుడు రాజు వద్దకు చేరి, "విజయా! రాజులకు వేటకు వెళ్లడం పరిపాటి. వేటకు వెళ్లి, అడవి జీవులను వేటాడి వండుకుని కమ్మగా తింటారు. మరి మీరెందుకు వేటకు వెళ్లడం లేదు." అన్నాడు. "చక్కగా గుర్తు చేశారు మంత్రిగారూ! ఈ సామ్రాజ్యానికి పరిపాలకుని అంటే కేవలం మనుష్యులకే కాదు. ఈ అడవిలోనీ జీవులకు, చెట్లకు కూడా. వాటిని రక్షించుకోవలసిన బాధ్యత రాజుగా నాపై ఉంది. ఇకపై వన జీవుల సంరక్షణ బాధ్యత తరచూ దగ్గరుండి చూసుకుంటాను. చెట్లను ఎవరూ నరికివేయకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది. మరిన్ని చెట్లను నాటించడం, వాటిని నిరంతరం సంరక్షించే బాధ్యత ప్రజలకు అప్పజెప్పాలి." అన్నాడు విజయ. తండ్రికి కొడుకుకు ఎంత భేదం? అనుకున్నాడు మంత్రి మహేంద్ర.

కామెంట్‌లు