సుప్రభాత కవిత : - బృంద
తడి ఎరుగని నేలకు
తనువు పులకరించింది
సడిలేని సవ్వడుల
సంబరాలు చేసుకుంది!

అడుగున దాచిన విత్తుకు
జీవం నింపి తోసింది
మొలకలతో మురిసిపోయి
కళ కళ గా మెరిసింది!

రాలతో నిండిన మనసు
రాగాలు పాడుతూ
వేలుగా విరిసిన కోర్కెల
చేలుగా నిలిచింది

పచ్చదనపు పైట వేసి
పరువపు మెరుపులతో
ముసినవ్వుల ముగ్దలా
ముద్దుగా తోచింది!

తెలివెలుగుల కాంతులలో
నులివెచ్చని  వేడి తగిలి
కనువిచ్చిన తలిరాకుల
కనువిందులు చేసింది

దూరాన గగనాన వెలుగు 
కాంచన పుష్పముగా భావించి
కనులారగ కమలాప్తుని చూసి
తనివారగ కైమోడ్చె భువి!

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు