సాయిమందిరాన ఘనంగా శంకరరావు ప్రవచనాలు

 ఆగూరు శ్రీ సత్యసాయిబాబా మందిరంలో తెలుగు భాషా పండితులు ముదిల శంకరరావు ప్రవచనాలు అందరిలో దైవభక్తిని ప్రేరేపింపజేసాయి. శ్రీ సత్య సాయి శతజయంతి సందర్భంగా మహాగణపతి, శివన్నారాయణ, శ్రీ సత్యసాయిబాబా కల్పోక్త పూజలు నిర్వహించగా, పూజల అనంతరం బోధించిన శంకరరావు ప్రవచనాలు ఆద్యాత్మిక శోభను సంతరింపజేసాయి. సర్పంచ్ కోనారి అప్పారావు, గంటా నాగేశ్వరరావు సాయిరాం, దామెర్ల అప్పారావు, సత్యవరపు వెంకట పాపిశెట్టి, పిల్లా రమణ, మహిళలు, తదితర భక్తజనులు శంకరరావును శాలువా, ప్రత్యేక కానుకలు, నగదు పారితోషికాలతో ఘనంగా సన్మానించారు. శ్రీ మద్భగవద్గీతా పారాయణం గూర్చి ప్రవచనాలు గావించిన శంకరరావు భగవాన్ సత్య సాయిబాబా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ప్రస్తావించి అందరి ప్రశంసలు పొందారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.
కామెంట్‌లు