మరణంలో కూడా ఆ ముగ్గురు:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)విశాఖపట్నం.

 పెద్దక్క వివాహాం లో  ఆడుతు పాడుతు
అమ్మా నాన్నలు తోడ బుట్టిన తమ్ముడితో
సంతోషంగా గడిపిన
ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు
మేము  మీకు అండగా ఉంటామని
ఆడపిల్లలు అబలలు కాదు సబలలమని
ఉన్నత చదువులు చదువుకుని
ప్రయోజకులై  తమ్ముడిని  ఆదుకుంటామని
తమ ఊరి నుంచి బస్సులో
తండ్రే తమ హీరో అని స్ఫూర్తి ప్రదాత అని
బస్సు ఎక్కించిన తండ్రికి  అమ్మజాగ్రత్త నాన్న అని
మేము చదువుకున్నాం
నీకు అండగా ఉంటానని చెప్పిన
ఆ ముగ్గురు  కూతుళ్ళు అరగంట లోపునే
కంకర రాళ్ళను తీసుకు వచ్చే 
టిప్పర్ మృత్యు రూపంలో బస్ ను ఢీ కొట్టిన వేళ
అందనంత అనంత లోకాలకు వెళ్ళి
కన్న వారి  కడుపుకోతకు జీవితాంతం కారణమై
మరణించిన పంతొమ్మిది మందిలో ఒకరై
మరణంలో కూడా ఆ ముగ్గురు సోదరీమణులు శ్రీరాముని పాదాల దరిచేరుట విధి వైపరీత్యమా?
ఏమిటి ఈ  హృదయ విదారక సంఘటన
ఒకే సారి ముగ్గురు కుమార్తెలను కోల్పోయి
జీవచ్చవాలు గా మారిన
ఆ దంపతుల  వ్యథకు కారణమెవరు?
(నిన్న చేవెళ్ళ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మరణించిన విషయం తెలిసి ఆర్ద్రత తో వ్రాసినది)
........................

కామెంట్‌లు