సాహితీకవికళా పీఠం.
సాహితీ కెరటాలు.
===============
కవిత: జీవితం విలువైనది.
ఎందుకు ఉరుకులు పరుగులు.
సహనంతో ఉంటే సాధ్యం కదా.
తొందర పడకు సుందరవదనా.
ఆలోచన నిర్ణయం ప్రదానం.
అడుగులు తడబడనీయ్యకు.
గుప్పెడు విప్పేస్తే ఏమున్నది.
తొందర పడకు సుందరవదనా.
లక్ష్యంతో జీవించు.
వినయంతో జయంచు.
సహనంతో సాధించు.
తొందర పడకు సుందరవదనా.
ఆకాశం నీ హద్దు.
ఆవేశం నీకు వద్దు.
ఆశయమే నీ సత్తు.
తొందర పడకు సుందరవదనా.
ఎగిసే వేగం కన్న.
చేసే జీవన ప్రయాణం మిన్న.
కరిగే కాలంతో జీవన గమ్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి