అందమైన ఆఖరు పేజీ:- రమాదేవి వొజ్జల - లక్సట్టి పేట్ -మాంచెరియాల్
సాహితీ కెరటాలు 
సాహితీ కవి కళా పీఠం 
=================
 ఆఖరు పేజీ అందమైన పేజీ 

 మొదటి పేజీ ఆశాయుతం 
ముందు ఉంది ఏంతో సంతోషం
అందమైన  భావి  జీవితం...
ఆట పాటల ఆనందం
లేదు కల్లా  కపటం ,
తెలియదు మోసం ద్వేషం...

మధ్యలోని పేజీల్లో  చేరును  కొంచెం
కల్మషం, స్వార్ధం,బంధం,బాంధవ్యం 
బ్రతకడానికి ఆరాటం
ఆశలు నెరవేర్చుకోడానికి పోరాటం
అవి తీరక పోతే పరితాపం ..
ఇల్లు, ఇల్లాలు,పిల్లలు, సంసారం..
కష్ట పడితే గాని ఈదలేని సాగరం..

మన కోసం మనం రాసుకొనే 
అందమైన పేజీనే ఆఖరు పేజీ

గడపాలి మన ఇష్టానుసారం ..
చేయాలి ఆధ్యాత్మిక సాధనం..,
మార్చుకోవాలి జీవన విధానం,
చేయాలి ధ్యానం,సత్సంగ సాంగత్యం 
చేయాలి చివరి పేజీ భగవదంకితం. 


కామెంట్‌లు