ద్రౌపదీ స్వయంవరం తరువాత దృపదుడు పాండవులకు ఆభరణాలను ఏనుగులను గుర్రాలను కానుకగా ఇచ్చాడు. ద్రౌపది కూడా పతివ్రతా ధర్మంతో ఐదుగురు భర్తలకు సేవచేస్తూ ఉంది. కుంతీ దేవి కూడా కోడలిని సకలైశ్వర్య వంతురాలిగా సంతాన వతిగా దీవించింది. ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల వివాహ సమయంలో అనేక కానుకలు పంపాడు. ఆ విధంగా పాండవులు ఒక సంవత్సరకాలం రాజభోగం అనుభవించారు. దుర్యోధనుడు వేగుల వలన మత్స్యయంత్రాన్ని ఛేదించింది అర్జునుడని తెలుసుకుని పాండవులు లక్క ఇంట్లో మరణించ నందుకు చింతించాడు. విదురుడు ఈ విషయం తెలిసి సంతోషించాడు. దృతరాష్టృడు మాత్రం దృపదుని కుమార్తె ద్రౌపదిని చేసుకుని పాండవులు మిత్ర లాభం పొందారని అనుకున్నాడు. ఒకరోజు విదురుడు దృతరాష్ట్రుని వద్ద లేని సమయం చూసి దుర్యోధనుడు కర్ణునితో వచ్చి " తండ్రీ ! పాండవులు బ్రతికి ఉన్నారు. విదురుడు పాండవ పక్షపాతి అని తెలిసి కూడా నీవు అతనికి విలువ ఇవ్వడం దురదృష్టకరం " అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో " నాయనా ! నేను పైకి పాండవులంటే ఇష్టమున్నట్లు ఉంటాను కానీ అది నిజం కాదు. విదురునికి అది తెలియనీయను. మనం ఒక విషయం మరువ కూడదు. పాండవులకు దైవ బలం ఉంది. మనం వారిని ఏమీ చేయ లేము " అని చెప్పాడు.
సుయోధనుడు తండ్రితో సమాలోచన
దుర్యోధనుడు " తండ్రీ పాండవులు ఇప్పుడు దృపద రాజ పురంలో ఉన్నారు. వారికి పాంచాల రాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, వృష్టి, అంధక రాజులు తోడుగా వున్నారు. వారిని బలహీనులను చెయ్యాలంటే పాంచాలరాజు నుండి వేరు చెయ్యడం ఒక మార్గం. రెండవది కుంతీ పుత్రుల మధ్య మాద్రీ పుత్రుల మధ్య విభేధం సృష్టించడం. మూడవది అందగత్తె లైన స్త్రీలను ప్రయోగించి పాడవులు ద్రౌపది మధ్య విభేదం సృష్టించడం. నాల్గవది కుటిలో పాయంతో భీముని చంపి పాడవులను నిర్వీర్యులను చేయడం. వీటిలో ఏది మంచిదో మీరే నిర్ణయించండి " అన్నాడు. కర్ణుడు దుర్యోధనునితో " దుర్యోధనా ! సజ్జనులు సత్ప్రవర్తనులు అయిన పాండవులను దృపదుడు వదులుకోడు, ద్రౌపది కోరి పాండవులను వివాహ మాడింది కనుక విభేధం సృష్టించడం సాధ్యం కాదు. భీముని చంపడం సాధ్యమైన పని కాదు. ఇప్పటి వరకూ చేసిన అటువంటి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కనుక దృపదుని ఓడించి పాండవులను పట్టుకు వస్తాము " అన్నాడు. ధృతరాష్ట్రుడు " పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాము" అని అన్నాడు.
దృతరాష్ట్రుడు భిష్మాదులతొ సమాలోచన చేయుట
మరునాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారితో సమావేశమై విషయం వివరించాడు. భీష్ముడు దుర్యోధనునితో " సుయోధనా ! నాకు మీరు పాండు సుతులు సమానమే. పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను. పాండవులు కూడా ఈ రాజ్యానికి వారసులు కనుక వారికి అర్ధ రాజ్యం ఇచ్చి కీర్తిమంతుడివికా " అన్నాడు. ద్రోణుడు " సుయోధనా కర్ణుని మాట వినవద్దు. తాతగారి మాట పాలించు " అన్నాడు. ఈ మాటలు కర్ణునికి ఆగ్రహం కలిగించాయి " సుయోధనా ! వీరిమాటలు వినవద్దు వీరు నీ సంపదను అపహరించి నీకు తలపెడతారు " అన్నాడు. ద్రోణుడు " కర్ణా ! మేము కీడు తలపెట్టు వారమా ? నీవు మేలు తలపెట్టు వాడవా ? నీ వలననే ఈ కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది " కర్ణునితో అన్నాడు. విదురుడు కలుగ చేసుకుని వారిద్దరిని వారించి " పెద్దలైన భీష్మ ద్రోణుల మాటలను పాటించడం నీ ధర్మం. పాండవులు అజేయులు. ఇపుడు దృపద మహారాజు అండ ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వంటి మిత్రుల బలం ఉన్నది. వారిని జయించడం అసాధ్యం. పురోచనునితో లక్క ఇంట్లో పెట్టి తగులబెట్టిన అపకీర్తి పోవాలంటే అర్ధ రాజ్యం ఇవ్వడం ఉచితం " అన్నాడు. గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులను తీసుకు రావడానికి విదురుని పంపాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి