దేవసేనాపతి కార్తికేయుని రంగురూపు వర్ణన పురాణాల్లో వర్ణింపబడింది.ఆరుముఖాలు కాబట్టి షడాననుడు అనిపేరు.నార్త్ ఇండియాలో శివపార్వతుల ప్రధమసంతానంగా భావించి షడాననమాతగా అమ్మ ని కీర్తిస్తారు.దేవదానవయుద్ధం సదా హోరాహోరీ సాగేది.దేవతలు ఎప్పుడూ పరాజయం పాలవుతుంటే దేవగురువు బృహస్పతి వారితో ఒక సేనాధ్యక్షుని ఎన్నుకోమని సలహాఇస్తాడు.బ్రహ్మ తో సహా అంతా శివుని దగ్గరకెళ్లి"మేము దానవుల చేతిలో చావుదెబ్బలు తింటున్నాం. ఓసేనాపతిని మాకు ప్రసాదించు" అని వేడుకుంటారు. శంకరుడు సమాధిస్థితిలోఉండగా శక్తిని స్మరించాడు.ఓచిన్నపిల్లాడు ఎదుట ప్రత్యక్షమైనాడు. అలా ఆపిల్లాడికే వేదశాస్త్రపారంగతుని చేశాడు.కానీ పిల్లాడికి పాలిచ్చి పెంచింది మాత్రం కృత్తికాది ఆరుమంది కావటంతో కార్తికేయుడనే పిల్వబడ్డాడు. ఓరోజు బ్రహ్మ ఆబాలుడ్ని చూసి అతనికి దేవతల సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు.అప్పటినుంచి షష్ఠి తిథిని సుబ్రమణ్యషష్ఠి అని కుమార స్వామిని పూజిస్తున్నాం.రోగాలు దరిచేరవని శుభాలు జరుగుతాయని అందరి నమ్మకం🌷
కార్తికేయుడు...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి