* 55 వ రోజు జైత్ర యాత్ర
ధర్మరాజు తన నలుగురు తమ్ములను నలుగురిని పిలిచి నాలుగు దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు.
అర్జునిని జైత్రయాత్ర
అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున ఉన్న పుళిందుడిని, ప్రతివీద్యుడిని, ఆఖిలద్వీప మండలాధీశులను ఓడించి సామంతులను చేసాడు. ప్రాగ్జోతిషపుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు. అతనితో ఎనిమిది రోజులు యుద్ధం చేసాడు. భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు. భగదత్తుడు " అర్జునా ! నేను ఇంద్రుడి మిత్రుడిని. నీవు ఇంద్ర పుత్రుడివి నీకు ఏమి కావాలో చెప్పు " అన్నాడు. అర్జునుడు " భగదత్తా ! ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. మీరు కప్పం చెల్లించండి యాగానికి రoడి " అన్నాడు. తరువాత అర్జునుడు అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి రాజులను జయించి కప్పం గ్రహించాడు. ఉలూక దేశాధిపతి బ్రహంతుని, ఉత్తర ఉలూక దేశాధిపతులను, దేవప్రస్థ రాజు సేనా బిందుడిని, విష్వగశ్వుడిని, పర్వత రాజులను, బర్బర, శబర, తురుష్క రాజులను, మాళవ, పౌండ్ర, కాశ్మీరాది దేశాధిపతులను ఓడించాడు. సింహపురాధీశుడు, చిత్రాయుధుని, ఆటవిక రాజులను, దస్యులను, కాంభోజ కటక రాజును జయించాడు. మేరు పర్వతాన్ని దర్శించాడు. ఉత్తర కురుదేశాలమీద దండెత్తి ఓడించాడు. వారివద్ద కప్పములు, రత్నాభరణాలు గ్రహించాడు. ఈ విధంగా అర్జునుడు ఉత్తరదేశ జైత్ర యాత్ర పూర్తి చేసాడు.
భీమసేనుని జైత్రయాత్ర
భీమసేనుడు తూర్పుదేశా జైత్ర యాత్రకు వెళ్ళాడు. పాంచాలదేశం, విదేహదేశం, దశార్ణ దేశం జయించి ఛేది దేశంలో అడుగుపెట్టాడు. ఛేది రాజు శిశుపాలుడు తల్లీ మాట పై భీమసేనుడికి కప్పం కట్టాడు. ఆ విధంగా భీమసేనుడు తూర్పుదేశాలను (అoగ రాజు అయినా కర్ణుని జయించాడు, మగద దేశాని జయించాడు) . కోట్లసంఖ్యలో రత్నములు, వజ్రములు, బంగారం, ధనం కప్పంగా తీసుకు వచ్చాడు.
సహదేవుని జైత్రయాత్ర
సహదేవుడు దక్షిణ దిశగా జైత్ర యాత్రకు వెళ్ళాడు. సుమిత్రుడు, శూరసేనుడు, దంతవక్త్రుడు, యవనులను జయించాడు. నర్మదా నది తీరాన అవంతీ రాజులను ఓడించాడు. మహిష్మతీ పురం చేరాడు. ఆ దేశపురాజు నీలుడితో యుద్ధం చేసాడు. సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్ని దేవుని పురికొల్పాడు. పూర్వం నీలుని వంశస్థుడు అయిన నిషాధుడు రాజ్యం చేసే సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ రూపంలో మహిష్మతీ పురంలో వేదాధ్యనం చేస్తున్నాడు. ఆ సమయంలో పొరపాటున పరస్త్రీతో సంగమించాడు. రాజభటులు అగ్ని దేవుని పట్టుకుని నిషధుని ముందు నిలబెట్టారు. అగ్ని దేవునికి కోపం వచ్చి తన నిజరూపం చూపించాడు. తన అగ్ని కీలలతో బుసలు కొట్టారు. నిషధుడు భయపడి అతనికి మొక్కాడు. అగ్ని దేవుడు శాంతించి నిషధుడిని వరం కోరుకొమ్మని చెప్పాడు. నిషధుడు " అగ్ని దేవా ! భవుష్యత్తులో మహిష్మతిపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చేయి " అడిగాడు. బదులుగా అగ్నిదేవుడు నిషధుణ్ణి " మహిష్మతీపుర వనితలు శృంగారవతులు. వారి స్వేచ్చావివాహారానికి నీవు అనుమతి ఇవ్వాలి " అని అడిగాడు. అగ్ని దేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలను అగ్ని కీలలు చుట్టుముట్టాయి. సహదేవుడు శుచియై అగ్ని దేవుని స్థుతించాడు. అగ్ని దేవుడు అభయం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న నీలుడు సహదేవునితో స్నేహంచేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు. సహదేవుడు అక్కడ నుంచి రుక్మి, భీష్మక, శూర్వాక, దండక రాజులను జయించాడు. వారు సహదేవునికి కప్పం చెల్లించాడు. దక్షిణ సాగర ప్రాంతరాజులను జయించాడు. తాళవనం, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక, రాజులను జయించాడు. చివరిగా లంకాధిపతి విభీషణునికి ధర్మరాజు రాజసూయ యాగం గురించి, తన దక్షిణదేశ జైత్ర యాత్ర గురించి వివరించి విభీషణుని వద్ద కప్పం తీసుకురమ్మని దూతలను పంపాడు. విభీషణుడు అందుకు అంగీకరించి కప్పం పంపాడు. సహదేవుని జైత్రయాత్ర పూర్తి చేసాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి