సాహితీ కెరటాలు*
=============
నీ ప్రేమకై నేను పిచ్చోణ్ణయ్యా!
నేరం చేసినోళ్ళే వెళతారు జైలుకు!
నేను, ఏ నేరం చేశానని ఈ ప్రేమ ఖైదు!
నేను ప్రేమించడమే మహా నేరమా ?
లేదా..నాకు ప్రేమించే ప్రధమ హక్కు?
ప్రేయసి రూపాన్ని నచ్చి వెంటపడ్డాను...
తెలుసుకున్నాము ఒండొరుల అభిరుచులు...
పెళ్లయింది వైభవంగా పెద్దల అనుమతితో!
మా సంసారం సాగేను అన్యోన్యంగా!
ఎక్కడో,ఏదో, చిక్కుముడి మా మధ్య...
వచ్చింది ఇది మూడో వ్యక్తి ప్రవేశంతో!
నేనిక్కడ, ఆమె అక్కడ... బందీలయ్యాం!
ఈ ప్రేమ ఖైదు ఎన్నాళ్లు భరించాలి?
అవకాశమే లేదా... పునస్సంగమానికి?
ఆలోచించాం...ఇరువురము వేరు వేరుగా!
మా ఇద్దరి ఆలోచనలు ఒకటయ్యాయి...
వాట్సాప్ మెసేజ్ లు జరిపే రాయబారం!
వేసుకున్నాం ఒక పక్కా ప్రణాళిక!
పెద్దలు చింతించారు...విషయం తెలిసి!
వారు ఏకాంతంకల్పిస్తే...అయ్యాం మేము ప్రేమ ఖైదీలం!!
నీ ప్రేమకై నేను పిచ్చోణ్ణయ్యా!-కోలా సత్యనారాయణ -విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి