ఆరాటపడకు...ఆలోచించు:-కోలా సత్యనారాయణ విశాఖపట్నం

సాహితీ కెరటాలు*
==============
ఆరాటం పెళ్ళికొడుకు పేరంటాలి 
వెంటపడ్డాడట! 
వేచియుండు పెళ్లి అయ్యేవరకు.. 
అలా చేయక! 
కోయకు పండు ముగ్గే వరకు ఎపుడూ..
చెట్టు నుండి! 
సంతానం కోసం సంబరపడక.. నిరీక్షించు,
దైవం ఇచ్చేవరకు! 
కలలు కనకు లక్షాధికారి కావాలని.. 
రాత్రికి రాత్రే!
నిరీక్షించు నీ కృషికి తగ్గ ఫలితం.. 
వచ్చేవరకు!
కళ్ళతో చూసింది ఎప్పుడూ నమ్మక, 
నిజ నిర్ధారణ చెయ్యి! 
పెళ్లి గురించిన కలలు కనకు, బాధ్యతలు 
పూర్తయ్యే వరకు! 

బుట్టలో వేయకు రచనలను.. అనుకున్న
అంశాలు లేవని! 
పెద్దలు చెప్పిన సుద్దులు విని.. తెచ్చుకోకు, 
ఎపుడూ ఆగ్రహం! 
వేచియుండునవమాసాలు.. ముందుగా
పురుగు పోయాక! 
కన్నవారు వృద్ధులయ్యారని తలచుకు.. 
వారిని భారంగా!
కన్న రుణంతీర్చకపోయినా.. వదలకు 
వారిని వీధిలో!
బంధుమిత్రుల ఆదరణ ఇచ్చు నీకు.. 
భవితలో సత్ఫలము! 
మానవసేవయే మాధవ సేవ అని.. 
నీవెన్నడు మరువకు!
సుందర వదనా తొందర పడకు.. ముందున్నది 
ముసళ్ళ పండగ!!

కామెంట్‌లు