ఆలోచన...భక్తి:- - యామిజాల జగదీశ్
 నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను అని ఒక భక్తుడు చెప్పగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు..... 
"అయితే ఈ ఆలోచనలు రెండు రకాలు. మొదటి రకం మీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే నా గురించి ఆలోచిస్తారు. అంటే, అవసరం కోసం లేదా ఏదో ఒక కారణం కోసం నా గురించి ఆలోచిస్తారు. వారడిగినది వారికి లభిస్తుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు. 
ఇక రెండవ రకం వారు ఎల్లప్పుడూ 
నా గురించి ఆలోచిస్తారు. ఏ క్షణంలోనైనా నా గురించి ఆలోచిస్తారు. వారు ఎంత బిజీగా ఉన్నా సరే, నా గురించి ఆలోచిస్తారు. స్మరిస్తారు ఉంటారు. వారికి నా అవసరం ఏమీ ఉండదు. వారు నా నుండి ఏమీ కోరుకోరు. కానీ వారికి నేను మాత్రమే అవసరం. వారికి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండదు. దీనిని భక్తి అని పిలుస్తారు. 
నిజానికి రెండూ భక్తి. కాదనను. కానీ వీటిలో రెండవ రకం మంచిది. మీరు మొదటి రకం అయినప్పటికీ, అది సరే. మీరు కొన్ని సార్లు నా గురించి ఆలోచిస్తారు. సరియైనదా?  కానీ మీరు క్రమంగా రెండవ రకం వైపు రావచ్చు...."

కామెంట్‌లు