వరాల వర్షం..!!!:- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కలిభూషణ్-పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
ఎక్కితే ఎవరెస్టు శిఖరం..?
దక్కును కీర్తి కిరీటం...!
ఇది కాదనలేని నగ్నసత్యం

ఔను ఆశించడం ఆపితే..? 
మొదలవుతుంది...ఆనందం  
శాసించడం ఆపితే..? 
మొదలవుతుంది...సంతోషం 

దూషించడం ఆపితే..? 
దూరమౌతుంది...దుఃఖం 
ద్వేషించడం ఆపితే..? 
మొదలౌతుంది...స్నేహం  

ప్రేమించడం ప్రారంభిస్తే..?
వికసిస్తుంది...మానవత్వం 
శ్రమించడం ప్రారంభిస్తే..? 
సొంతమౌతుంది...సౌభాగ్యం

పరుగును ప్రారంభిస్తే..?
చేరువౌతుంది...గమ్యం 
సాధన ఆరంభిస్తే..?
సాధ్యమౌతుంది...లక్ష్యం 

నిత్యం పూజించడం భక్తితో
ప్రార్థించడం ప్రారంభిస్తే..? 
దైవం కురిపించు నీకు...వరాల వర్షం 
సత్సంకల్పంతో కార్యం ప్రారంభిస్తే..?
సిద్దిస్తుంది నీకు...అఖండ విజయం  



కామెంట్‌లు