దుర్జయుని కథ! :- అచ్యుతుని రాజ్యశ్రీ

 సుప్రతీకుడు అనే రాజు మంచి పరాక్రమవంతుడు ఆయనకి ఇద్దరు భార్యలు విద్యుత్ ప్రభ కాంతిమతి కానీ పిల్లలు పుట్టలేదు అందుకే ఆయన చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు దుర్వాస మహర్షికి సేవలు చేశాడు సరిగ్గా అప్పుడే ఇంద్రుడు దుర్వాసుడు దగ్గరికి వచ్చాడు కానీ మునికి నమస్కారం చేయకుండా నుంచోటంతో కోపంతో దేవరాజా నీవు నన్ను అవమానించావు నీ రాజ్యం పోగొట్టుకుని వేరే చోటికి వెళ్లి ఉండు అని చెప్పించాడు ఆ తర్వాత దుర్వాసుడు సుప్రతీకులతో ఓ రాజా నీకు బలవంతుడైన పుత్రుడు ఇంద్ర సమానుడు అయినా కొడుకు పుడతాడు కానీ అతని పనులు చాలా క్రూరంగా ఉంటాయి. ఎప్పుడ డు అస్త్రాలతోటి ఉంటాడు అతని పేరు దుర్జయ అని పెట్టు అని ఆశీర్వదిస్తాడు సుప్రతీకుడు తన రాజ్యానికి వచ్చాడు విద్యుత్ ప్రభ కి దుర్జేయుడు పుట్టాడు ముని అతని స్వభావాన్ని చాలా సౌమ్యంగా మార్చి వేద శాస్త్రాలు పాటించేలా గొప్ప విద్వాసుడిగా ధర్మాత్మునిగా ఆశీర్వదించాడు కాంతిమతికి సుఘుమ్న అనే వివేకవంతుడైన కొడుకు పుట్టాడు సుప్రతీకుడు వారణాసి రాజధానిని తన పెద్ద కొడుకు  దుర్జయునికి అప్పగించి చిత్రకూటంపై తపస్సులో మునిగాడు దుర్జేయుడు తన చతురంగ సైన్యాలతో చాలా దేశాన్ని జయించి దాదాపు భారత దేశమంతా తన రాజ్యాన్ని అధికారాన్ని సుస్థిరం చేశాడు ఆపై ఇంద్రునిపై యుద్ధానికి వెళ్ళాడు సుమేరు పర్వతం పై న ఉన్న గంధర్వ దేవత దానవ కిన్నర  మొదలైన వారందరినీ ఓడించి ఇంద్రుని కూడా పరాభవించాడు అతను సుమేరు పర్వతాన్ని విడిచి మధ్యలోకానికి వెళ్ళాడు దుర్జయుడు గంధమాదన పర్వతం పై విశ్రమించాడు అతని దగ్గరికి  విద్యుతుడు సువిద్యుతుడు అనే ఇద్దరు వచ్చారు ఓ రాజా మమ్మల్ని పాలకులుగా నియమించు జనాలని మేము బాగా చూసుకుంటాం జనుల  సేవ చేస్తాం అని చెప్పటంతో వారిద్దరిని లోకపాలుకులేనిగా చేశాడు ఆపై దుర్జేడు మందరాచల పర్వతం కి వెళ్లి చంపక వృక్షం కింద కూర్చున్న ఇద్దరు సుందరీమణులను చూశాడు అతని దగ్గరికి ఇద్దరూ తపస్సు చేసుకుని హేతు ప్రహేతు అనేవారు వచ్చి రాజా మేము స్వయంభూ మనువు కొడుకులం దేవతల యుద్ధం చేసాంఅప్పుడు ఓడిన దేవతలంతా విష్ణుమూర్తిని శరణువేడటంతో మేము ఇద్దరం మాత్రమే మిగిలాం.మాసైన్యం సర్వనాశనమైంది.మీతండ్రి సుప్రతీకుడు మాకు మంచి మిత్రుడు. మాకుమార్తెలను పెళ్లాడు" అని వేడుకున్నారు. హేతు కూతురు సుకేశీ, ప్రహేతు కూతురు మిశ్రకేశీని  దుర్జయుడు పెళ్లాడాడు.భార్యలవల్ల ప్రభవ, సుదర్శన అనే కొడుకులకు తండ్రియైనాడు. దుర్జయుడంటే అర్థం జయించటం అసంభవం అని అర్ధం.మంచితనం ఉత్తమ గుణాలుంటేనే రాజు కానీ సామాన్యుడు కానీ గౌరవ మర్యాదలు పొందుతారు🌹
కామెంట్‌లు