రాజపుత్రచిన్న చిన్న రాజ్యాలుజైపూర్ బికనూర్,,యోధపుర్ ఉదయ్ పుర్ ముఖ్య మైనవి.పర్వతాలు నీటికరువు కానీ రాజపుత్రులు త్యాగం సాహసం స్వాభిమానం దేశ భక్తితో పునీతులు. మేవాడ్ మార్వాడ్ శిరోమణులు.ఆరావళీపర్వతాలలో తలదాచుకుని ఔరంగజేబుని ఎదిరించిన వీరులు.అలాంటి యోధుడు దుర్గాదాసు. ఆశకరుణుడు సేనాపతి కొడుకు దుర్గాదాసు. బాల్యంలోనే పంటపొలాల్లో రాజసైనికులుచొరబడితే వారిని ఎదిరించిన దుర్గాదాసుని మార్వాడురాజు ప్రశంసించాడు. రాజు యశ్వంతసింహుడు, 16ఏళ్లకే తండ్రిచనిపోటంతో బాధలో ఉన్న దుర్గాదాసుని చేరదీశాడు.కాబూల్ ముస్లింలను ఔరంగజేబ్ ఆదేశంపై అణిచాడు.ఔరంగజేబ్ మార్వాడ్ పై కన్నేసిఉన్నాడు.మహారాజు చనిపోతే,అతని కొడుకు అజితసింహుని రక్షించే బాధ్యత తనపై వేసుకున్నాడు దుర్గాదాసు.
దుర్గాథాయ్ అనే దాసి రాణివేషంలో, ఆమె కొడుకు రాకుమారునిగా బలైనారు.ముకుందదాసు రాజపుత్రుని రాణిని దాచాడు.మొగల్ సేనలు మార్వాడ్ ని సర్వనాశనం చేశాయి.దుర్గాదాస్ ఈవిషయం తెలుసుకుని ఔరంగజేబ్ పనిపట్టాడు. ఔరంగజేబ్ కొడుకు అక్బర్ దుర్గాదాసు తో సంధిచేసుకున్నాడు.అతని పిల్లల్ని ఆదుకున్నాడు. దుర్గాదాసు ఐదేళ్లు మహారాష్ట్ర లో ఉండి అక్కడి పరిస్థితులను చక్కబెట్టిన వీరుడు.ఇరుగుపొరుగుల క్షేమంకోరిన నిస్వార్థ రాజపుత్రుడు.మొగలుల పీచమణిచి మార్వాడ్ ని ఏకంచేశాడు.అజిత్సింహుడు మార్వాడపీఠం ఎక్కాడు. మొగల్ పాదుషా బహదూర్ షా అతనికి కానుకలు సమర్పించాడు. 30ఏళ్లుశ్రమించిన దుర్గాదాసు ఉదయపూర్ లో అంతిమ శ్వాస విడిచాడు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి