తెల్సుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్

 ఆరోజు క్లాస్ లో పరీక్షాఫలితాలు ,పాసైన వారి పేర్లను హెడ్మాష్టార్ చదువుతుంటే క్లాసంతా నిశబ్దంగా ఉంది."సర్! నాపేరు చదవలేదు మీరు?" ఆకుర్రాడు లేచి ధైర్యంగా అడిగాడు."నీవు ఫెయిల్ అయి ఉంటావు!?నీకు మలేరియా వస్తే చాలారోజులు బడికి రాలేదుకదా?""సర్! నేను పాసైతీరాలి.మలేరియాకి ఉత్తీర్ణత కి సంబంధంలేదు" దృఢంగా అన్నాడు ఆపిల్లాడు." నీవు పొరపాటైతే జుల్మానా కట్టాలి.50రూపాయలు విధిస్తా" " ఫర్వాలేదు సర్!నేను పాసయితీరుతాను" నదురుబెదురులేని ఆబాబునిచూశాడు ఎగాదిగా! ఇంతలో క్లర్క్ పరుగున వచ్చి"సర్!క్లాస్ ఫస్ట్ వచ్చిన ఆబాబుపేరు లిస్ట్ లో రాలేదు" అనగానే హెచ్.ఎం.నివ్వెరపోయాడు.ఆకుర్రాడే మనతొలిరాష్ట్రపతి రాజర్షి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
1955వసంవత్సరంలో మద్రాస్ ఐఐటి లో స్కాలర్ షిప్ తో ఓబీదవిద్యార్ధి చదువుతున్న రోజులవి.ఏరోనాటికల్ ఇంజనీర్ ఆకుర్రాడితో పాటు ఇంకో ఇద్దరికి ఒకసబ్జక్ట్ ఇచ్చి త్వరగా రిపోర్టు ఇవ్వమన్నాడు. ఆఇద్దరు కుర్రాళ్లవల్ల బీద విద్యార్థికి రిపోర్ట్ లేట్ ఐంది.ఆగైడ్ పాపం అతన్ని" నీస్కాలర్షిప్ ఆగుతుంది" అని బెదిరించాడు.పాపం టెన్షన్,మాటవినని ఇద్దరు సోంబేరుల పని తనే చేస్తూ రాత్రంతాకాలేజీలో గడిపి మూడ్రోజుల్లో రిపోర్ట్ ఇచ్చాడు తిండినిద్రమానేసి.గ్రూప్ లీడర్ ఐన అతన్ని ఆ తిట్టిన గైడ్ మెచ్చుకుంటూ"శెభాష్,కొన్నివారాల పనిని మూడ్రోజుల్లో చేశావు" అనగానే ఆయువకుని మొహంలో కృతజ్ఞత తొణికిసలాడింది. ఆయనే ఎ.పి.జె.అబ్దుల్ కలాం! సంగీత సాహిత్యాల్లో   అభిరుచి ఉన్న ఆయన పిల్లలతో మమేకమైన గొప్ప వ్యక్తి.అనాయాసమరణం పొందిన ధన్యజీవి.చిత్తశుద్ధి లక్ష్యసిద్ధి ఉన్న కారణజన్ముడుబ్రిటిష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ 8వక్లాస్ 3 సార్లు ఫెయిలైనాడు.ఆంగ్లంలో పట్టులేక ఫెయిలైనాడు.అలాంటి వాడు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో అతిధిగా వెళ్లి "నెవర్ గ్యివ్ అప్" అని మూడే మాటలు పెద్దగా  రెండు సార్లు చెవులు హోరెత్తేలా అరిచి స్టేజీ దిగాడు.నోట్లో సిగార్,చేతిలో కర్ర, టాప్ హ్యాట్ తో  ఆయన ఇచ్చిన ఆచిన్న ఉపన్యాసం చరిత్ర లో నిలిచిపోయింది.
నోటిమాటలకన్నా వీపు తలపై చేయివేసి నిమిరితే పిల్లలు వృద్ధులు సంతోషిస్తారు. దుఃఖంలో ఉన్న వారిని మాట తోకన్నా స్పర్శతో ఓదార్పు ఊరట చెందుతారు. ఏడ్చేవ్యక్తి రెండు చేతుల్ని తమ చేతుల్లోకి  తీసుకుని తేలికగా అదమాలి. పిల్లల బుగ్గలు వీపు నిమిరితే వారిలో భయం జంకుపోతుంది. రష్యాలో బేర్ హగ్,ఫ్రాన్స్ లో చెంపపై ముద్దు,రోమ్ లో బుగ్గపై చిటికె ,అమెరికాలో చేతులు కలపటం స్పర్శ లో రకాలు🌹
కామెంట్‌లు