మ్యాచ్"లో కీలకం…పిచ్ + క్యాచ్..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్.
సహజంగా…
విజయం సాధించిన జట్టు
ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ…
ఎన్నో రోజుల శ్రమను భుజాలపై మోస్తూ…
తమ కఠోరమైన సాధనను నమ్ముకుని…
“కష్టే ఫలి… శ్రమయేవ జయతే”
అని నిత్యం జపిస్తూ…
సమిష్టిగా చేసిన పోరాటానికి
ప్రతిఫలంగా విజేతలకు
లభించే...కీర్తి కిరీటమే…"కప్పు"...

ఒకప్పుడు
ఆశపెట్టి దోబూచులాడి...
చేజారిపోయిన ఆ "కలల కప్పు"…
కల ఫలించి నేడుచేతికి చిక్కినప్పుడు
సంతోషంతో చిలకలవలె చిందులేస్తూ
ఎగురుతూ గర్వంగా "కప్పు"
గాల్లో ఎగరేస్తారు క్రీడాకారులంతా…

తమపై కొండంత నమ్మకం పెట్టి
అరుదైన అవకాశాన్నిచ్చినవారికి
మనసారా వందనం చేస్తూ…
ప్రోత్సాహించిన ప్రతి కన్నుకు...
ప్రార్ధించిన ప్రతి హృదయానికి...
ఆసరాగా ఉన్న ప్రతి అభయహస్తానికి...
కృతజ్ఞతలు తెలియజేస్తూ…

విజేతల జట్టు
గెలుపు వెలుగుల్లో…
సన్మానాల సందడిలో…
ప్రశంసల పరవళ్ళలో…
సంతోషసాగరాన
మునిగి తేలుతూఉంటే…

ఓడిన జట్టు ఆత్మపరిశీలనలో
అడుగులేస్తూ...బ్యాటింగ్ లో…
బౌలింగ్ లో…ఫీల్డింగ్ లో…
ఎంత ప్రతిభ కనబరిచినా…

క్లిష్ట సమయాన మిస్"…
చేస్తే కీలకమైన ఒక్క "క్యాచ్"
మారిపోవును గదా జట్టుజాతకమే...
అనూహ్యంగా మలుపు తిరిగి...మ్యాచ్"

ఒక్కోసారి
ప్రణాళికలెన్నివేలేసినా...
అంచనాలన్నీ...తారుమారే
అనుకూలించకపోతే..."పిచ్"?

ఔను ఆట ఆడేది క్రీడాకారులే...
కానీ ఆడించేది...
ఓడించేది...
గెలిపించేది...
నవ్వించేది...
ఏడ్పించేది...
ఉత్కంఠ భరితమైన
మలుపులు తిప్పేది...
ఉక్కిరిబిక్కిరి చేసేది...
హైటెన్షన్ కు గురిచేసేది...
అనూహ్యమైన ఆశ్చర్యకరమైన
అఖండ విజయంతో ఆకాశానికెత్తేసేది...
అపజయంతో...అవమానభారంతో...
అథఃపాతాళానికి నెట్టేసేది...ఎవరు...?

ఇంకెవరు...పైనున్న ఆ పరమాత్మే....!
ఔను జీవితంలో జనన మరణాల వోలే..!
ఆటలో గెలుపు ఓటములు దైవాదీనాలే..!



కామెంట్‌లు