ప్రశ్నిస్తే వివరం తెలుసుకోవచ్చు...
ప్రతికూలపు భావాలు ఉండవు.
చర్చిస్తే సమస్యే ఉండకపోవచ్చు
దూరమయే అవసరం ఉండదు.
అంగీకరిస్తే అనాదరణ జరగకపోవచ్చు
ఆక్షేపణకు ఆస్కారం ఉండదు.
విమర్శలు కొన్నిటితో నేర్చుకోవచ్చు
వాదించే అవసరం ఉండదు.
నిందకు నిలబడి జవాబివ్వవచ్చు
వదిలేసుకునే అవసరం ఉండదు.
సహనం కష్టంగా అనిపించవచ్చు
సగం లో వదిలే ప్రసక్తి ఉండదు..
ప్రయత్నం శక్తి కి మించిందే కావచ్చు
విజయం రాకుండా ఉండదు.
ఆలస్యం అసంతృప్తి అనిపించవచ్చు
ఆనందం లభించకుండా ఉండదు
చీకటి దిగులు నింపవచ్చు
వేకువ కాకుండా ఉండదు.
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి