*****
"అబ్బబ్బా! ఏం ఆర్భాటం! ఏం ఆర్భాటం! గడియ పుర్సత్ లేకుండ జయమ్మ దాని పెన్మిటి ఒకటే అయిరాన పడుడు. పరేషాన్ అవుడు. "కక్కొచ్చినా కల్లేనమొచ్చినా ఆగదే" శెల్లె! అంటె "నీకేందే అవ్వా! అన్ని తీర్సుకున్నవ్.గిప్పుడు మారాణొతికె కాల్మీద కాలేస్కుని కూకోని గిట్ల ఎన్ని ముచ్చట్లైన చెబ్తవ్! అంది.గట్లంటే ఎందుకో గని నా మన్సు కలుక్కుమంది రా అయ్యా!"
"పోనీయే అవ్వా! అందరొక్కతీర్గ ఉంటరా ఏంది? గా శిన్నమ్మ సంగతి నీకు తెల్సిందే గదనే. తొందర్పడి నోరు జార్తది. ఆనెక్క నాలిగ్గర్సుకుంటది. పా! పా! గిప్పట్కే ఆలీసమైంది. గిప్పుడా వచ్చేదని అందరిముందు గయ్యిన లేశినా లేత్తది."
అన్న మాటల్కి "నిజమేరా కొడ్కా! అన్కుంట గబ్బగబ్బ పెట్టెలున్న పట్టుచీర కట్టుకొని,కాసుల పేరు బెట్టుకొని బయల్దేరింది అవ్వ.
***
పదారొద్దుల పండగెల్లినంక వొచ్చిన జెయమ్మ మొగం సూస్కుంట "ఏందే శెల్లె! మంచాలబడి నవిశిందానొతికె గట్లయినవ్."ఇంగో!గిప్పుడే చాయ జేసిన తాగు మన్కుంట" కోపుల పోసి ఇచ్చింది.
ఉఫ్ఫ ఉఫ్ఫ ఊద్కుంట ఒక్కో గుట్క తాక్కుంట "గిట్ల ఒక్కలంటె ఒక్కలు నన్ను పట్టించ్కున్నోళ్ళు లేరవ్వా! వొంచినడ్ము ఎత్తకుండ చేశి చేశి ఒళ్ళు పుల్సిపోయింది.
"గిదేమో గనవ్వా! పెండ్లి ఆత్రపడి జేశినమని గిప్పుడనిపిస్తంది.పొల్ల లబ్బ లబ్బ మొత్కుంటనే వుంది నాకీ పెండ్లొద్దు గీ సద్వు నడిమిట్ల ఆపకుండ్రని. "మంచి సంబంధం.గిస్మంటిది దొర్కదనుకుంట పెండ్లి జేసినం."
గా మాటల్కి అవ్వ "ఎట్లయితేందే శెల్లె! నువ్వన్కున్నొతికె పిల్లకు పెండ్లి జేసి బాద్దెత తీర్సుకున్నవ్."అయ్యిందమ్మ పెళ్ళి- అణిగిందమ్మ రంధి" అన్నట్టు మొత్తాన్కి పెండ్లి రంది తీరింది. ఇంగ నన్న సైమానికి తిని, కాత్తంత రెట్టు తీస్కో.
ముత్తెమంత సైసే శెల్లె! ఉప్పుడుబిండి అయితంది. తిని పోదువు గని" అంటున్న అవ్వ మాటల్లో ప్రేమకి జెయమ్మ కళ్లల్ల గిర్రున నీళ్ళు తిర్గినయ్.
గదండీ సంగతి " అయ్యిందమ్మ పెళ్ళి- అణిగిందమ్మ రంధి అంటే గిదే. పెళ్ళి జేసేటోళ్ళకు గదైపోయేదాక కంటిమీద రెప్పబడదు.కడుపుకు తిండి సయించదు. సైమానికి అన్కున్న పనులు జర్గవు. గందుకే "పెండ్లో పెండ్లో అని రంధి జేసినోళ్ళను" గిట్లనే సామెతతో బనాయిస్తరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి