తుహిన బిందువుల తెరను
తొలగించి కనులు తెరచి
తరలి వచ్చు తొలివెలుగుల
తపనుడికై ఎదురుచూపు..
అన్నీ తెలిసిన అజ్ఞానం
అహం పెరిగిన జ్ఞానం
అధిగమించేసి ఎదిగిపోతానని
అమాయకమైన నమ్మకం
ఏదీ సొంతం కాదని తెలిసీ
అన్నీ సొంతం చేసుకోవాలనుకునే
అపరిమితమైన ఆశ
కాదా అమాయకత్వం?
ఏ నిమిషానికి ఏమౌనో
ఏ కలతలు చుట్టుముట్టునో
ఏమీ తెలియకపోయినా
అంతా తెలుసు అనే అమాయకత్వం!
మాయగా ఏర్పడిన జగతిలో
మాయతో వచ్చిన జన్మలో
మాయని దుఃఖం పాలౌతూ
మాయక ఉంటాననుకునే అమాయకత్వం!
తెరలను తొలగించి
తెలివిని కాస్త పెంచి
తెరపిని కలిగించే
తెల్లవారి వెలుగులకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి