అబ్రహం లింకన్ చిన్న కుమారుడు థామస్. అతని ముద్దు పేరు "టాడ్". అబ్రహాం లింకనే అతనికి ఈ
ముద్దుపేరు పెట్టారు. ఇంతకీ ఆయన ఈ ముద్దుపేరు ఎందుకు పెట్టారంటే, అతను చిన్నతనంలో "టాడ్పోల్" లాగా మెలికలు తిరుగుతూ ఉండేవాడు.
1853లో జన్మించిన "టాడ్" ఆనందమూ, దుఃఖమూ కలగలిసిన ఇంట్లో పెరిగాడు. పెరిగాడు. అతని అన్నయ్య విల్లీ అతనికి అత్యంత సన్నిహితుడు. అంతర్యుద్ధ సమయంలో వైట్ హౌస్ వారి ఆట స్థలంగా మారింది. టాడ్ శక్తిమంతుడు. ఆప్యాయతకు మారుపేరు. అనూహ్యంగా ప్రసిద్ధి చెందాడు. అతను క్యాబినెట్ సమావేశాలలోకి దూసుకుపోయేవాడు.
వైట్ హౌస్ పచ్చికలో పెంపుడు మేకలతో పడుకునేవాడు. ఎంతో స్వేచ్ఛను అనుభవించిన వాడు.
యుద్ధ భారం, లెక్కలేనన్ని ప్రాణాలను కోల్పోవడంతో తలమునకలైన లింకన్, టాడ్ పట్ల ఎంతో సున్నితంగా మెలిగే వాడు. ఆ బాలుడి అల్లరి చేష్టలు అబ్రహాం లింకన్ ను తెగ నవ్వించేవి.
1862లో అతని అన్నయ్య విల్లీ అనారోగ్యంతో మరణించిన తర్వాత తండ్రీకొడుకుల మధ్య బంధం మరింత బలపడింది. విల్లీ మరణం కుటుంబాన్ని కుంగదీసింది. సరిగ్గా ఆ సమయంలోనే అనారోగ్యానికి గురైన టాడ్ ను మరింత గారాబంగా చూసుకునేవారు. లింకన్, తన కొడుకును దగ్గరే ఉంచుకునేవాడు. కొన్నిసార్లు అతన్ని తన కార్యాలయంలోనే నిద్రపోయేలా చేశాడు.
అమెరికా ప్రజలకు, లింకన్ ఒక అధ్యక్షుడు. అయితే టాడ్ కు ఆయన కేవలం ఓ "నాన్న". తండ్రీకొడుకులు కలిసే భోజనం చేసేవారు. సాయంత్రం షికారుకెళ్ళేవారు. వ్యక్తిగతంగా జోకులు పంచుకునేవారు. యుద్ధ సమయంలో, టాడ్ తరచుగా తన తండ్రి వెంటే ఉండేవాడు. ప్రతి చోటుకీ వెళ్ళేవాడు. లింకన్ అర్థరాత్రి వరకు పని చేస్తున్నప్పుడు సైతం నేలమీదే పడుకునేవాడు.
1865లో లింకన్ హత్యకు గురైనప్పుడు, టాడ్ కేవలం పన్నెండేళ్ళ కుర్రాడు. తనకు అన్ని విధాలా తోడునీడగా ఉన్న తండ్రి లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు టాడ్. అతను "పా చనిపోయాడు" అని పదే పదే ఏడ్చే వాడిని అనుకునేవారు. తండ్రి హత్య తర్వాత, టాడ్, అతని తల్లి కొంతకాలం వివిధ ప్రాంతాలలో పర్యటించారు, కానీ బాలుడిగా అతనిలో నింపిన వెలుగులు తిరిగి రాలేదు. అతను 1871లో పద్దెనిమిదేళ్ల వయసులో అనారోగ్యంతో మరణించాడు.
అబ్రహం లింకన్, టాడ్ కథ రాజకీయాలు, యుద్ధ వాతావరణానికి అతీతంగా ఉండేది. ఇది అసాధారణమైన గందరగోళం మధ్యలో ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉన్న ఈ తండ్రి - కొడుకుల మధ్య ఉన్న గాఢానుబంధాన్ని సన్నిహితులు, బంధువులు కథలు కథలుగా చెప్పుకునే వారు. ఈ రెండు హృదయాలు ఒకవైపు తమ చుట్టూ ఉన్న ప్రపంచం శాశ్వతంగా మారుతుండగా చిన్న చిన్న వెచ్చదనాన్ని పొందుతుండేవి అందరి దృష్టినీ ఆకట్టుకునేవి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి