ఆత్మవిశ్వాసంతో అడిగేయ్: - విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్
 సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు
=====================
నేను చేయగలను అనుకొని చేస్తే బలానికే బలం.
నేను చేయగలనా అనే సందేహం బలానికి బలహీనత.
ఆత్మవిశ్వాసం నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాలకు తలుపులు తెరుస్తుంది.
మరుగున ఉన్న శక్తి సామర్ధ్యాలకు బలం పెరుగుతుంది.
నమ్మకానికి నమ్మిక సారం వచ్చి చేరుతుంది.
కొడితే కొట్టాలిరా దెబ్బ అదిరిపోవాలని కొడితే ...
కొండలు కదులుతాయి బండలు ముక్కలవుతాయి.
నావల్ల ఏమవుతుందనుకుంటే గాలి తీసేసిన బుడగవుతుంది జీవితం. 
పిరికితనం ఉన్న బలాన్ని ఖూనీ చేస్తుంది.
చలనచిత్రంలో కథానాయకుడు దుమ్ము లేపుతుంటే చప్పట్లు.
న్యాయాన్ని ధర్మాన్ని ఆశ్రయిస్తేనే ఆత్మవిశ్వాసానికి మద్దతు.
రాముడు పది తలల రావణాసురుని నేల కూలిస్తే, 
అంబరం నుండి దేవతల పూలవర్షానికి పౌరుల సంబరం.
అన్యాయ అధర్మాలకు ఆత్మవిశ్వాసం అభాసుపాలవుతుంది.
కండబలం కన్నా గుండె బలం నిండుగా ఉంటే ...
ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో.

•••••••••••••~•

కామెంట్‌లు