సుప్రభాత కవిత : - బృంద
మనసును మురిపించు 

మేదిని సౌందర్యంలో
అంతరంగాన కలిగె
అంతర్యామి  దర్శనం!

చూపుల మెరుపే 
నీరాజనమవగా.....
కురిసే కన్నీరు 
పాదముల కడుగదా!

అదుపు చేయలేని 
ఆనంద తరంగం 
అర్పించే మానసిక
అర్ఘ్య పాద్యాచమనం కాదా?

ఆపాదమస్తకము 
అబ్బురముగా పరికించు 
కనుదోయి  వెలుగులు 
ప్రజ్వలించు దీపాలు కావా?

ధ్యానాన మమేకమై
ఎదలో నిండిన రూపము
ఎప్పటికీ విడిపోక
త్వమేవాహం అంటూ కలిసిపోదా!

సకల శుభాలనిచ్చు 
సర్వేశ్వరుని ఆగమనం 
విశ్వమంతా వెలిగించు 
విశ్వరూప విన్యాసం

🌸🌸సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు