దయ కృప!- అచ్యుతుని రాజ్యశ్రీ

 దయాకృప దాదాపు ఓకే అర్థం అంటే జాలి చూపటం దేవుని దయ ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు చెడు పనులు చేస్తే దాని ఫలితం చెడు మనకు వస్తుంది కోరిక నెరవేరితే అది దేవుడి దయ నెరవేరకపోతే అది దైవ కృప మన మంచికే అలా జరిగింది అని అనుకుంటే బాధ ఉండదు తాత చెప్తున్నా ఈ మాటల్ని పిల్లలు బాగా ఆలకిస్తున్నారు. శివ అన్నాడు తాత నేనెప్పుడూ క్లాస్ ఫస్ట్ అన్నిట్లో నాకే ప్రైజులు వెరీ గుడ్ అదంతా దేవుడి దయ అంటే నీవు కష్టపడుతున్నావు సాధిస్తున్నావు దేవుడు నీకు సాయం చేస్తున్నాడు అదే కృప ఇంతలో గీత అంది తాత నాకు ఫస్ట్ మార్కులు రావు అయినా ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులతో పాస్ అవుతూ ఉన్నాను బి గ్రేడ్ తెచ్చుకుంటున్న మరి నాకు ఎలర్జీ దగ్గు ఆయాసం కదా తాత అన్నాడు పోనీలే అమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం చలికాలం జాగ్రత్తలు తీసుకోవాలి వేడినీరు తాగుతూ ఉండాలి వెచ్చటి దుస్తులు వేసుకోవాలి నీది దైవ కృప ఉంది కాబట్టే ఫెయిల్ కాకుండా మనోబలం ఇచ్చాడు దృఢ సంకల్పం ఉంది నీకు నీ శక్తికి తగ్గట్లేదు చదువు అలాగే భక్తుల్లో రకాలు ఉన్నారు పటాతోపంగా ఆడంబరంగా పూజలు గుడిలో హడావిడి చేస్తూ పిల్లికి బిచ్చం పెట్టరు ఇంకొందరు దీన జన సేవ చేస్తూ గుడికి వెళ్లరు దైవం దృష్టిలో వీరే గొప్ప అహంకారం లేకుండా సర్వం బ్రహ్మమయం అనుకోవటమే దైవ సంకల్పబలం సంపద సుఖభోగాలు కలలు అలలు క్షణభంగురాలు కొబ్బరికాయలో నీరు లాగా నీటి బుడగలాగా కర్మ బంధాలు అంతే ఎవరితో బంధం అనుబంధం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఈ జన్మ పాపపుణ్యాలు మరుజన్మలో మనల్ని వెంటాడుతాయి మొండితనం పట్టుదల విడిచి సర్వం బ్రహ్మమయం అనుకుంటూ మన పని మనం చేయాలి లేకుంటే తుప్పు పట్టిన యంత్రంలా మనం ఎందుకు పనికిరాము🌹
కామెంట్‌లు