లేకుంటే... అధో గతే...! :- కోరాడ నరసింహా రావు .
ప్రజా స్వామ్య ప్రభుత్వ ఉద్దేసమే... సంక్షేమ సమ సమాజ స్థాపన...! 

ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పనిచేయాల్సిన ప్రభుత్వాలు... 
   ప్రజా శ్రేయస్సుకై అందిం చాల్సిన సహకారాన్నే  ఓట్ బాంక్ గా మలచుకునే నీచ సంస్కృతి! 

అధికారహస్త గతం కోసం 
దేశ ఆర్ధిక పరిస్థితిని సమ్మూలంగా నాశనం చేయటానికి దిగజారే స్వా ర్ధం...!

అవసరాలకు మించి, రాయితీలుఇవ్వలేమన్నం దుకుఅధికారాన్నికోల్పోయి... ఇస్తా మన్నవారు అందలమెక్కటం...! 

అధిక రాయితీలే గెలుపు అస్త్ర మని... దాన్నే ప్రయోగించి, తిరిగి అధికారాన్ని చేజిక్కించు కుని, అమలు జరిపేందుకు అష్ట కష్టాలు...!! 

విద్య, వైద్యము, వృద్దు లకు పెంక్షన్లు ఇవి తప్పనిసరి! 
 అర్హులకు మాత్రమే...! 

ఏమాత్రం సిగ్గు,లజ్జ లేకుండ,అర్హులు కానివారే ఎక్కువ...., 
 రాయి తీలుపొందు తున్న వారిలో...! 

ప్రమాదకర భవిష్యత్... 
  ఛాపకింద నీరులా....! 

అటు ప్రజలైన... ఇటు ప్రభుత్వా లైనా... ఆసిస్తున్నది తాత్కాలిక ప్రయోజనాలే...! 
 సాశ్వత దారిద్ర్యమునకు , యావత్ భారత జాతి బానిసత్వమునకు దారి తీ సే పొంచియున్నప్రమాదం !

బావి తరాల భావిష్యత్ అయోమయం!! 

ఇక నైనా విచక్షణతోఅటు ప్రజలు - ఇటు ప్రభుత్వాలు  
 ఆలోచించాలి.... 
    లేకుంటే అధో గతే...!! 
      *****

కామెంట్‌లు