వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో – ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
 వికారాబాద్ జిల్లా యాలాల మండలం బాగాపల్లి ప్రాథమిక పాఠశాల, పగిడియాల్ జడ్‌పి హెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి తాండూరు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ, కవయిత్రి మొల్ల కళా వేదిక ఫౌండర్–అధ్యక్షులు KVM వెంకట్    GHM కృష్ణయ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని బాల్య దశలోనే విద్యార్థులకు చక్కగా అన్ని చతుర్విధ ప్రక్రియలతో పాటు సామాజికంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని మొలక దశ నుండి విద్యార్థులకు అవగాహన పెంచాలన్నారు. పగడాలు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చక్కగా వేషధారణ తో  ఒక్క రోజు టీచర్స్ గా విద్యార్థులు విద్యార్థులకు పాఠాలు  బోధించారు. కష్టపడి చదువుకొని  మంచి పౌరులుగా ఎదగాలని సందేశమిచ్చారు. చిల్డ్రన్స్ డే వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
 కవయిత్రి మొల్ల కళావేదిక ఆధ్వర్యంలో బాగై పల్లి చిన్నారులకు ఐడి కార్డులు పంపిణీ చేశారు
పాఠశాల ఉపాధ్యాయులు  బాల కృష్ణ, హారిక మోహన్, రవి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌లు