బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్ తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తెలిపారు. రెండు వేల రూపాయల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసపత్రం 23నవంబర్ రోజున తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ లో అందజేస్తామన్నారు. జాతీయ స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతికి కీర్తన ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఆడేపు కరుణాకర్ అభినందించారు. విద్యార్థుల రచనలతో గత సంవత్సరం హవేళి ఘణపూర్ అమృత గుళికలు పుస్తకం ప్రచురించామని, భవిష్యత్ లో కూడా పుస్తక ప్రచురణ చేస్తామన్నారు. విద్యార్థులలో సాహిత్య సృజనకు పాటుపడుతున్న తెలుగు ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశం, నల్ల అశోక్, ఎల్లమ్మలను అభినందించారు.
జాతీయస్థాయి కథల పోటీలలో ప్రథమ బహుమతి ఎంపికైన కీర్తన
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి