సాహసవీరుడు...! : - కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
ఓ ఉత్తర కుమారుడు...
ఎవరు తరమకముందే 
పరుగు తీస్తాడు
భయం అతని బాట
ఆర్భాటం అతని ఆట..!

ఒక సాహసవీరుడు...
జ్వలిస్తాడు...అగ్నిపర్వతంలా...
గర్జిస్తాడు...గాండ్రిస్తాడు పులిలా...
సదాసిద్ధం ఏటికి ఎదురీందుకు... 
విధితో పోరాడేందుకు ..!

నిజాయితీ అతని కవచం...
ధైర్యం అతని ధనుస్సు...
చిరునవ్వుతో స్థితప్రజ్ఞతతో
పర్వతాలను కదిలిస్తాడు..!

ఓ పిరికివాడు...
భయం పంజరంలో పక్షి 
చీకటిలో వణుకిపోతాడు...
బ్రతుకుతూనే వందసార్లు చస్తాడు..!

ఓ ధైర్యవంతుడు...
ఒకసారే మరణిస్తాడు ...
యుగయుగాలు జీవిస్తాడు..!

పిరికితనం ఒక పీడ...
ధైర్యమే జీవన దీపం...
వెలుగు వైపు నడిచే మనిషే
సాహస వీరుడు...సింహబలుడు..!


కామెంట్‌లు