సాహిత్యంతోనే సామాజిక మార్పు జరుగుతుందని నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియ రూపకర్త ఈర్ల సమ్మయ్య అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాదులోని త్యాగరాయగానసభ భవనంలో రామదాసు కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ రమ్య స్వరూప్ రచించిన 'రమ్య మంజరి, నవవల్లకి' పుస్తకాలను ఆవిష్కరించారు. మధురిమలు అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను ప్రారంభించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కవుల చేత రచనలు చేయిస్తూ, సాహిత్య సేవ చేస్తున్న పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామ నివాసి ఈర్ల సమ్మయ్యను కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ రమ్య స్వరూప్ శాలువా మేమెంటో, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ సాహిత్యం సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా సామాజిక చైతన్యాన్ని కలిగించేదిగా ఉండాలన్నారు. అద్భుతమైన మధురిమలు రాసిన రచయిత డాక్టర్ రమ్య స్వరూప్ ని ఈర్ల సమ్మయ్య అభినందించారు. చిన్న వయసులోనే ఆమె చేస్తున్న సాహిత్య సేవను కొనియాడారు. తెలుగు సాహిత్యంలో విశేష ఆదరణ పొందుతున్న మధురిమలు నియమాలను వివరించారు. చందోబద్ధమైన ఈ లఘు కవితా ప్రక్రియలో నాలుగు పాదాలు ఉంటాయని, ప్రతి పాదంలో 7నుంచి 12 వరకు గల అంకెలను ఉపయోగించాలన్నారు. నాలుగు పాదాల్లో సమాన సంఖ్యలో మాత్రలు ఉండాలని, ఒకటి మూడు, రెండు నాలుగు పాదాల్లో ప్రాస ఉండాలని లేదా నాలుగు పాదాల్లో క్రాస్ అనిమ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రచనలు చేయాలనుకున్నవారు, ఆసక్తి కలిగిన రచయితలు 9989733035 సంప్రదించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
సాహిత్యంతోనే సామాజిక మార్పు;- మధురిమలు రూపకర్త ఈర్ల సమ్మయ్య
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి