ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో రిశ్వంత్ జన్మదిన వేడుకలు

 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి రిశ్వంత్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఘనంగా నిర్వహించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబై పాఠశాలకు వచ్చిన రిశ్వంత్ సహచరుల మధ్య జన్మదినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. రిశ్వంత్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. అబ్బాయికి వారు స్వీట్లు తినిపించి, దీవించి, ఆశీర్వదించారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పాఠశాల పిల్లలు రిశ్వంత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల పిల్లల పుట్టినరోజు వేడుకలను పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందని, పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలనేదే తమ ఆశయమని ఆయన అన్నారు. అందుకోసమే పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయడమే కాకుండా పిల్లల సర్వతోముఖాఅభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని ఈర్ల సమ్మయ్య అన్నారు. సకల సౌకర్యాలు, చక్కటి ఉచిత విద్యను  అందిస్తున్న ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించి వేలాది రూపాయల డబ్బులు వృధా చేసుకోవద్దని ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్ కుమార్, ఎడ్ల స్రవంతి, మధ్యాహ్న భోజన నిర్వాహకులు విజయలక్ష్మి, ధరణి రజిని, పైడిపల్లి సతీష్ విజయలక్ష్మి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు