హెన్రీ ఫోర్డ్ పట్టణంలో అత్యంత చౌకైన గది కావాలని అడిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.
ఆయన అప్పుడే ఇంగ్లాండ్ చేరుకున్నారు. అప్పటికే ఆయన కోటీశ్మవరుడు. పైగా అత్యంత ప్రసిద్ధుడు.
అయినప్పటికీ, ఆయన కోరుకుంటే విలాసం ఏపాటిది? అయితే, ఆయన ప్రశాంతంగా విమానాశ్రయ కౌంటర్ వరకు అడుగులేసుకుంటూ వెళ్ళి ఇలా అడిగారు :
“నేనుండటానికి అత్యంత చౌకగా ఉండే చోటు చెప్పగలరు" అని అడిగారు ఫోర్డ్.
అయితే అక్కడి సిబ్బంది సంకోచిం చాడు.
ఫోర్డ్ కోటు చిరిగిపోయినట్లు అనిపించింది. ఆయన సూట్‌కేస్ చాలా సాధారణమైనది. ఆయన స్వరం ప్రశాంతంగా ఉంది. అయితే తన ఎదుట ఎవరు నిల్చున్నారో గుమస్తా గ్రహించాడు.
హెన్రీ ఫోర్డ్.
వార్తాపత్రికలలో ప్రధాన పాత్ర పోషించిన పారిశ్రామికవేత్త. ఆటోమొబైల్ విప్లవం వెనుక ఉన్న ప్రముఖ వ్యక్తి.
“క్షమించండి... మీరు మిస్టర్ ఫోర్డా?” అని గుమాస్తా ఆశ్చర్యంగా అడిగాడు.
ఫోర్డ్ ఏ మాత్రం సంకోచం లేకుండా ఔనన్నట్లు తల ఊపారు.
“అవును, నేనే ఫోర్డుని.”
అప్పటికే దిగ్భ్రాంతి చెందిన గుమాస్తా తన మాటలు కొనసాగించాడు :
“మీ కొడుకు సాధారణంగా లగ్జరీ హోటళ్లలో ఉంటారు. అతి ఖరీదైన బట్టలు ధరిస్తారు…కానీ మీరేమో చౌకైన గదిని అడుగుతున్నారు.
ఎందుకు?” అని అడిగాడు.
ఫోర్డ్ ఒక చిన్న నవ్వు నవ్వాడు — ఆయన చెప్పిన మాటలు జీవితకాలానికి ఒక పాఠం చెప్పడానికి సరిపోతాయి.
“నాకు కావలసిందల్లా నిద్రించడానికి ఒక స్థలం. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఇప్పటికీ హెన్రీ ఫోర్డ్‌నే. నేను వేసుకున్న కోటు మా నాన్నది. ఇది నన్ను వెచ్చగా ఉంచుతుంది - అది చాలు.” అని అన్నారు ఫోర్డ్.
ఫోర్డ్ ఒక క్షణం ఆగి, ఆపై మెల్లగా ఇలా అన్నారు...
“నా కొడుకు ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించి అతను ఎక్కువగా ఆందోళన చెందుతుంటాడు...నేను ఖర్చు చేయడం ద్వారా ధనవంతుడిని కాలేదు. కాలేను. నిజంగా ఏది ముఖ్యమైనదో, ఏది కాదో తెలుసుకోవడం ద్వారా నేను ధనవంతుడినయ్యాను.” అని.
తెలుసుకోవలసిన పాఠం :
నిజమైన సంపద మీరు ప్రదర్శించే దానిలో కనిపించదు. కానీ మీరు అర్థం చేసుకునే దానిలో కనిపిస్తుంది.
మీరు మీ బట్టలు కాదు. మీరు ఉండే హోటల్ కాదు. మీ బ్యాంక్ ఖాతా కాదు. మీరు మీరే — మీరు ఎక్కడ ఉన్నా సరే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి