మీరె జాతికి ఖ్యాతి:- కోరాడ నరసింహా రావు!
బాల బాలికలు మీరు ! 
   మీవి మల్లెల వంటి మనసులు
     విరిసిన గులాబి పువ్వులే మీ బోసి నవ్వులు

మీ బుడి బుడి అడుగుల నడకలు 
  హృదికి పెట్టు గిలిగింతలు

మీ ముద్దు ముద్దు పలుకులు 
    వీనులకవి విందులు

మీ లేత మనసులు కల్మషమ్ లేని ఆవు పాలు

మాయా మర్మము తెలియదు మీకు 
  కల్ల, కపటం ఎరుగరు మీరు 

 చక్కని చదువులు , బుద్దిగ శ్రద్దగ చదవాలి
  గొప్పవారిగా ఎదగాలి
జాతికి ఖ్యాతిని తేవాలి
 భారత జాతికి ఖ్యాతిని తేవాలి...! 
      ******
    
 రేపటి ఉత్తమ పౌరులు  మీరై జాతికి ఖ్యాతిని తే వాలి

కామెంట్‌లు