శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు
 శ్లో కం :నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ ।
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 6 ॥
పదార్థ వివరణ
నమః శివాభ్యాం – శివపార్వతీ దేవతాద్వయానికి నమస్కారం
అతిసుందరాభ్యాం – అత్యంత సుందర రూపం కలిగిన వారికి
అత్యంత మాసక్త హృదంబుజాభ్యాం – పరస్పరం బలమైన ప్రేమతో హృదయాలలో నిలిచియున్న వారికి
అశేష లోక ఏక హితంకరాభ్యాం – మూడు లోకాలన్నింటికీ మేలుచేసే ఏకైక దైవజంటకు
నమో నమః శంకరపార్వతీభ్యామ్ –మేం శంకరపార్వతీ దంపతులకు పునః పునః నమస్కారం
భావార్థం
అత్యంత సుందరులైన,
పరస్పరం హృదయాలలో గాఢమైన ప్రేమతో ఏకమై ఉన్న,
మూడూ లోకాలకూ మేలుచేసే దైవజంట అయిన
శంకరపార్వతీ దేవతలకు
మళ్లీ మళ్లీ నా నమస్కారాలు.
             *********

కామెంట్‌లు