సామెత -60;-అల్పుడికి ఐశ్వర్యమొస్తె అద్దమ్మ రాతిరేల గొడుగు పట్టమన్నడంట
****
"లోకమేందవ్వా గిట్ల మారింది?ఎవ్వన్ని జూద్దామన్నా మణుసులు మణుసుల్లెక్క లేరు.శిత్ర శిత్రంగ మార్తున్నరు. గాళ్ళు గీల్లేనా? గీళ్ళు గాల్లేనా అన్న యిశారం మన్సును కుమ్మరి పురుగోలె తొలుత్తుంది."
"ఏందే శెల్లె!గంతగనం యిశారం జేసేది ఎవుల ముచ్చటే?"
"ఇంకెవలు అవ్వా! గా బిచ్చపతి బావ ముచ్చటే? ఒకప్పుడెట్లుండె? గిప్పుడెట్లుండు? ఏతులెక్కువైనయి. నోరు దెరిస్తే తనంత దశమంతుడు ఈ లోకంలనే లేడని ఎచ్చులు గొడ్తుండు. పుట్టుకే రాసపుట్టుకని గప్పాలు జెబుతుండు.ఎవ్వలి నోట యిన్నా గా బిచ్చపతి ముచ్చటే! ఇదొరకటిలా శేతులు నుల్ముకుంట పది పరకో అప్పుకని వొచ్చి గవిచ్చేదనుక గబ్బిలమొతికె ఇంటి శూరుకు ఏలాడుతుండేటోడు."
ఓష్నీ! శెల్లే!గా బిచ్చపతి ముచ్చెట్నా! ఇంగ సరిపాయె తీ.సూత్తున్న సూత్తున్న... రాతిర్కి రాతిరే గాయ్న నసీబు మారింది. మారితే మంచిదేగని గాయ్న ఆలకం, చేట్టలు అస్సలు మంచిగ లెవు.
ఎన్కటికి ఎవలో సెప్పినట్లు"అల్పుడికి ఐశ్వర్యమొస్తె అద్దమ్మ రాతిరేల గొడుగు పట్టమన్నడంట" అన్నొతికుంది గా బిచ్చపతి యవ్వారం."
"అవునవ్వా! ఊల్లె అందరంట్రుండ్రు. గా బిచ్చపతికి లచ్చిందేవి అట్ల ఇట్ల గాదు పడిషం బట్టినట్టు బట్టిందంటుండ్రు.ఇంగ గాయ్న సోకు సూడాలె .మామూల్గ లేదుపో.తనే ఊల్లె పెద్దమణిషి చేతి కింద బాంచెన్ కాల్మొక్త అన్న తీర్గ ఉండేటోడు.గస్మంటోడు గిప్పుడు తనే ఒకణ్ణి శేతి కింద బెట్కొని మీసాల్దిప్పుకుంట తనంత మొనగాడె లేడన్నట్టు జేత్తుండవ్వా!"
"అవునట శెల్లె!అల్పమాడిచ్చె - చెవులు జాడిచ్చె" అనేదాన్కి గీ బిచ్చపతినే ఉదార్ణగ సూపాలి.ఎక్కడల్పం ఎక్కడల్పం పో. రేతిరి పగలు వొంటి మీద వాష్కోటు, ఖద్దరు పంచె వొదలకుండ ఏస్కుంటుండంట. తన తాన పన్కి బెట్టుకున్నోన్ని రాతిరి , పగలు మెసలనీయట్లేదట. ఇంగ పొద్దుగాల దారి పొంటి బొయ్యెటప్పుడు సూడాలె. పనోడు ఎన్కాల చెత్రి బట్టుకొని నడుసుడు.గిది ఎండకాలం,వోన కాలం సుత గాదు గదనే.అయినా గట్లుంది గీ బిచ్చపతి ముచ్చటి.
"అవ్వా! ఎంత లాట్రీ తగిల్తే మాత్తరం మరీ గంత మిడిసిపాటా?"ఏమోలే గది నీ శెవులెయ్యనీకె వొచ్చిన.ఇంగ పోతవ్వా! బర్రెపాలు దియ్యాలె" అన్కుంట బోయింది వొజ్రమ్మ.
గదండీ!సంగతి! "అల్పుడికి ఐశ్వర్యమొస్తె అద్దమ్మ రాతిరేల గొడుగు పట్టమన్నడంట" అంటే గిదే మరి.అల్పబుద్ధి ఉన్నోడికి అనుకోకుండా సంపదొస్తే గిట్లుంటదని మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి