నా ఆప్త మిత్రుడు పుస్తకం :- కవి మిత్ర, సాహిత్య రత్న -అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-హైదరాబాద్
 పార్వతీపురంలో
పరమేశ్వరం తాతయ్య
పదవ ఏట వరకు
పట్టువదలని విక్రమార్కుడిలా
పవిత్ర భగవద్గీత శ్లోకాలతో
పరవస్తు చిన్నయసూరి
పంచతంత్రకథలతో
పుస్తక పఠనం చేస్తే
ధారణ పెరుగునన్నది
ఆరవై ఏళ్లయి ఆచరణలో పెట్టి
అలసిన హృదయానికి సాంత్వన చేకూరుస్తుందని
నా పిల్లలతో బాటు
మనుమలకు కూడ
పుస్తక ప్రాముఖ్యత తెలియచేస్తు
పుస్తకం, పత్రికలు,సాహిత్య సభలే జీవితమా అని
ఏభై ఏళ్లయి కాపురం  చేస్తున్న ధర్మపత్ని అంటే
అవును  నా ఆప్తమిత్రుడు పుస్తకమే
ఆ తరువాత నీవు అంటే
నిజమే నండి  నా జీవిత సాఫల్యత కు కారణం
మీతో గడిపిన జీవిత మనే పుస్తకం నాకు శ్రీమద్రామాయణ గ్రంథంతో. సమానమే అంటే
ఆప్యాయంగా చినిగిన బట్టనైనాధరించు, క్రొత్త పుస్తకాన్ని కొనుక్కో అన్న
సంఘ సంస్కర్త కందుకూరి
అడుగుజాడల్లో 
అరవై ఏళ్లయి నడుస్తు
అన్ని విషయాలు నిత్య విద్యార్థి గా తెలుసుకుంటున్నాను.!
..........................

కామెంట్‌లు