కాలభైరవ స్వరూపాలే
నోరులేని మూగజీవులే
కారుణ్యం చూపాలి
సర్వప్రాణికోటి పరమాత్ముని స్వరూపులే..!
వీధి శునకాల స్వైరవిహారంలో
రోజు రోజుకి ప్రాణాలు కోల్పోతు
కన్నవారి కడుపుకోతకు
కారణమవుతున్న
సంఘటనలను చూస్తుంటే
హృదయం ద్రవించక మానదు
జీవకారుణ్యము ఉండాలి కాదనను...!!
పసిపిల్లలను కోల్పోయి
కన్నీరు మున్నీరై విలపిస్తున్న
తల్లిదండ్రుల జీవితాంత వ్యథకు
కారణం మెవరు
ప్రభుత్వమా?ప్రజలా?
పోయిన ప్రాణాలను తీసుకు రాగలరా
విజ్ఞులు, ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి...!!
( ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన రెండు సంఘటనలను చూసి ఆవేదన తో వ్రాసినది)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి