****
"శెల్లే! ఏం జేత్తున్నవ్? గీ యిసయం దెల్సిందా? పాండు మావ కాలం జేసిండంట."సూత్తానికి నిన్ను సుత తోల్కపోదమనొచ్చిన.
అయ్యో! అవ్వా ! ఎప్పుడు జర్గింది?నాకు దెల్వకనేపాయె. నిన్న సుత గుడికాడ అరుగుల మీద కూకోని మంచిగ నగుకుంట కానొచ్చిండు.శాపత్త కోసం కొట్టుకాడ్కి ఎల్లేదాన్ని ఆపి 'ఏం కోడలా!బాగున్నవా? మరీ నల్లపూసైనవ్? ఎన్నల్లేంది. నువ్వొచ్చినవేందన్నడు.
"అవునా శెల్లె!ఎవ్వలినైనా గట్ల మంచిగ నగుకుంట పల్కరిచ్చెటోడు.ఎవ్వలు తిట్టినా దుల్పేసుకునేటోడు.పెండ్లయినా, పబోజనమైనా పన్లకు ముందు తిండికి ఎన్క ఉండే మణిషిని గా పాండు మావనే జూసిన శెల్లె.కుల్లు కుత్సితం తెల్వనోడు.పసిపోరడంత అమాయికుడు.శెమట దీసి పన్జేయడం, శేతనైనంత సాయం జేయడం తప్ప ఇంకోటి తెల్వనోడు నేను బోతే ఎట్ల బత్కుతడని అత్తున్నంత కాలం రంది బెట్కొనె.
"అత్త బొయినంక ఏందిన్నడో? ఎట్లున్నడో?పాపం.పొద్దటీలి కొట్టంల పని కాంగనె,తానం జేసొచ్చి మంచంల కూసున్నోడు కూసున్నట్టె పోయిండంట.
"అయ్యో!గట్లనా అవ్వా! ఎంత సక్కని సావు. నవసకుండ ఎవ్వలితో చేయించుకోకుండ పోయిండు" గియ్యాల ఆకాశి పండగ.ఎంత మంచి సావో కదవ్వా ! పాండు మావది.
అవును శెల్లే! గిదేం శిత్రమో!అన్ని దెల్సిన గా నాగులయ్య మంచాన పడి తీస్కోని తీస్కోని అమాస నాడు పోయిండు. ఏమీ దెల్వని పాండు మావ పువ్వు లెక్క ఆకాశినాడు పోయిండు." గందుకే " అన్ని దెల్సినోడు అమాస నాడు - ఏమీ దెల్వనోడు ఆకాశినాడు పోయిండని" మన పెద్దోళ్ళు అంటుంటరు. గది గిదేనేమో శెల్లె!
అవునవ్వా! ఇంగ పా! బోళ్ళు తోముడైంది" శేతులు కొంగుకు తుడ్సుకుంట అవ్వతో బయలు దేరింది సూరమ్మ.
గదండీ సంగతి! "అన్నీ దెల్సినోడు అమాస నాడు - ఏమీ దెల్వనోడు ఆకాశినాడు పోయిండు" అంటే గిదే మరి.మంచోళ్ళకు విధి కూడా గిట్ల సహకరిస్తుందని అంటుంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి