(సత్య సాయి శత జయంతిత్సవ సందర్భంగా రాసినది)
................................
పుడమిపై పుట్టిన ప్రజలంతా
కులమతాలకతీతంగా
వర్ణవ్యవస్థ లేకుండా
పేద గొప్ప తారతమ్యం లేక
మానవత్వమే మాధవత్వమని
ప్రేమతత్వమే
పరమాత్మ తత్వమని
ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వంతో ఏకం చేయడానికి
అందరిలో సాత్విక భావం పెంపొందించడానికి
నేను అవతరించానని
దాహార్తుల దాహాన్ని
అన్నార్తుల ఆకలిని తీర్చడమే ధ్యేయంగా
విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని
తల్లిదండ్రులు పరదేవతా స్వరూపులని
జన్మనిచ్చిన మాతృమూర్తిని గౌరవించాలని
మన రామాయణ భారత గ్రంధాలు
భగవద్గీత వసుదైకానికే ఆదర్శమని
పరమత సహనం పాటించాలని
సత్యం శివం సుందరం అన్నది తెలిపి
విద్యతో బాటు బాల్యం నుంచి సంస్కారం నేర్పిన
ప్రపంచమే రామరాజ్యం అగునని
అపుడు లోక కల్యాణం జరుగునని
అసూయ ద్వేషాలు విడనాడి
ప్రేమానురాగాలను పంచి
'లోకా సమస్తా సుఖినో భవంతు'
'ధర్మో రక్షతి రక్షితః' అని
సద్గురువు భగవంతుని కన్న మిన్నయని
'బ్రహ్మ స్థానే కృతం పాపం
విష్ణు స్థానే వినశ్యతి
విష్ణు స్థానే కృతం పాపం
శివ స్థానే వినశ్యతి
శివ స్థానే కృతం పాపం
గురు స్థానే వినశ్యతి
గురు స్థానే కృతం పాపం
నాస్థి స్థానే వినశ్యతి'. !అని
గురు విశిష్టత ను
ప్రపంచానికే చాటిన
సత్యసాయి బాబా
దివి నుండి భువికి దిగివచ్చిన పరమేశ్వరులే.!
............................
సద్గురువు _సత్య సాయి :- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి