ఎందుకు పుట్టాడు!!?:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మనిషి 
బ్రతకడానికే పుట్టాడు! 

మనిషి 
తినడానికి కాదు బ్రతకడానికి పుట్టాడు.!!

మనిషి 
యంత్రంలా పనిచేయడానికి కాదు 
గాలిలా స్వేచ్ఛగా బ్రతకడానికి పుట్టాడు!!

మనిషి 
ఇతరుల కోసం కాదు 
తన కోసమే పుట్టాడు!!!

మనిషి 
విలాసం కోసం కాదు 
వికాసం కోసం పుట్టాడు 
వికాసమే విలాసమైన పర్వాలేదు!!?

మనిషి 
డబ్బు జబ్బు కోసమే కాదు 
విద్యా విజ్ఞానం కోసం పుట్టాడు!!
విద్యా విజ్ఞానమే విలాసమైన పర్వాలేదు!!?

ఆస్తులు అంతస్తులు 
భౌతికంగా స్వర్గ ద్వారాలు కావచ్చు 
మానసికంగా 
సంగీతం జ్ఞానం కలలు కళలు
స్వర్గమార్గాలు.!!

మనిషి 
గతం భవిష్యత్తు కోసం కాదు 
అర్థవంతమైన వర్తమానం కోసం పుట్టాడు.!!

మనిషి 
సంతోషం మనశ్శాంతి 
తన లోపలే కాదు 
బయట లోపల కూడా 
పొందడానికే  పుట్టాడు.!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు