వివిధ స్వరూపిణీ:- డా.సి వసుంధర,చెన్నై.

 అష్టాక్షరీలు
========
1)
శృతిపల్కులే భువిలో 
నవవిధ రూపములై 
అవతరించే అమ్మగా
చండీదేవ్యైనమోనమః
2)
దేవి, దేహి సాక్షాత్కారం దేహీ 
ఆరోగ్యసౌభాగ్యందనుజ గర్వనాశనీ
చండి దేవి నమోనమః
3)
విజయవాడ దుర్గమ్మ 
విజయలక్ష్మి మాయమ్మ
విజయమివ్వు కొమ్మరో
చండిదేవి నమోనమః
4)
దత్తానందోదయాన్వితే
దైత్య దర్ప వినాసినీ
నిత్యకళ్యాణి చండికా 
చండిదేవి నమోనమః
కామెంట్‌లు