వేదాల కథ :- అచ్యుతుని రాజ్యశ్రీ

 వేదాలు నాలుగు అని మనకు తెలుసు ఇది వెనకాల కథను తెలుసుకుందాం సత్య యుగంలో స్వయంభుమను అనే రాజుని మనం ఆది పురుషునిగా కొలుస్తాం.ఆయన ఇద్దరు కొడుకులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు.ప్రియవ్రతుడు తపస్వి ఆయనకి ఎంతోమంది కొడుకులు.ఏడు ద్వీపాల్ని పాలించారు. భరతుడు ప్రసిద్ధ పాలకునిగా తండ్రికి తగ్గ కొడుకు అనిపించాడు. ప్రియవ్రతుడు బదరికాశ్రమంలో తపస్సు చేస్తుండగా నారదుడు ఆయన దగ్గర కి వచ్చాడు.భక్తితో ఆయన నారదునికి సత్కారంచేసిన తర్వాత నారదుడు " నీకు ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్తావిను.శ్వేత ద్వీపంలో చెరువులో వికసించిన పద్మాలను చూశాను.ఒడ్డున పెద్ద పెద్ద కన్నులున్న ఓయువతి కన్పడింది.నేను ఆమె ఎవరని ప్రశ్నిస్తే జవాబీయకుండా అలా చూస్తూ ఉండిపోయింది.నాకున్న సంపూర్ణ వేదయోగ జ్ఞానాలన్నీ మాయమైనాయి.నాకు పూర్తిగా మతిమరుపు వచ్చింది.ఆమెనే అలా గుడ్లప్పగించి చూస్తూండిపోయాను.ఆ కన్యశరీరంలోంచి ఓదివ్యపురుషుడు కనిపించాడు.అతని మొహంనించి దివ్యకాంతులు వెలువడుతున్నాయి.అతని హృదయంనించి రెండో దివ్యపురుషుడు,అతని హృదయంలోంచి మూడోవాడు ఎర్రనికళ్లతో సూర్యునిలా వెలిగిపోతూ కన్పించారు. కాసేపటికి వారంతా మాయమైనా ఆకన్యమాత్రం అక్కడే ఉంది."అమ్మా! నీవెవరు?" అన్న నాప్రశ్నకు" నేను వేదమాత సావిత్రిని. నాహృదయంలోంచి వచ్చిన వారువేదాలు. అందంగా ఉన్న పురుషుడు విష్ణువు ఋగ్వేదం.ఆయన హృదయంలోంచి వచ్చినది యజుర్వేదం.శక్తిశాలి బ్రహ్మ .ఆయన వక్షస్థలం నుంచి వచ్చినది సామవేదం శంకరుడు. నీకుఇప్పుడు అన్నీ  గుర్తుకొస్తాయి.ఆవేదరూపి చెరువులో స్నానంచెయ్యి.నీపూర్వజన్మ స్మృతి కలుగుతుంది." అని చెప్పి ఆమె మాయమైంది.నేను ఆచెరువులో స్నానం చేసి నీదగ్గరకు వచ్చాను" అని నారదుడు చెప్పాడు.🌷
కామెంట్‌లు