అ అంటే అక్షరం, ఆ అంటే ఆరోగ్యం అని, విద్యార్ధి లోకమంతా ఆరోగ్యం కాపాడుకుంటూనే విద్యాబుద్ధులు అలవర్చుకోవాలని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు అనంతరం జరిగిన ఆరోగ్య సూత్రాలు కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. విద్యార్థులంతా తాము తీసుకునే ఆహార పదార్ధాలలో పౌష్టికాహారం ఎంతమేరకు ఉందో అవగాహన కలిగియుండాలని, త్రాగే నీరు పట్ల జాగ్రత్తలు వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ అధికారిణి బి.చంద్రకళ అన్నారు.
కాచి వడపోసి చల్లార్చిన నీటిని త్రాగాలని, ఇంట్లో ఆహారపదార్థాలపై మూతవేసి ఉంచాలని, బయట నుంచి తెచ్చిన తిండి పదార్ధాలను వీలైనంతవరకూ తగ్గించుకోవాలని ఇంట్లో వండుకునే ఆహారమే మహా శ్రేష్టమైనదని, పరిసరాల్లో చెత్తా చెదారాలు లేకుండా పరిశుభ్రత పాటించాలని, ఇంటికి గాలి వెలుతురు వచ్చేలా చూడాలని, రోజూ రెండు సార్లు దంతాల శుభ్రత, రెండు సార్లు స్నానం ఆచరించాలని అన్నారు. నిత్యమూ యోగా ధ్యానం చేస్తూ రోజూ ఉదయాన వాకింగ్ చేయాలని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ శుభ్రజగతికి దోహదపడాలని కమ్యూనిటీ హెల్త్ అధికారిణి చంద్రకళ పిలుపునిచ్చారు. ఎఎన్ఎం కుప్పిలి లక్ష్మీ నారాయణమ్మ, స్థానిక సచివాలయ మహిళా సంరక్షణా కార్యదర్శి మావూరు సంధ్య, ఆశా కార్యకర్త ఎన్.పద్మావతి తదితరులు పాల్గొని ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు చేపట్టవలసిన చర్యలు వివరించారు.
తొలుత నెహ్రూ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి, ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మ, అతిథులు ఎస్ ఎం సి ఛైర్ పర్సన్ సిహెచ్ లక్ష్మి, జిఎంఆర్ విఎఫ్ సిఎస్ వింగ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ లావేటి రాజు, సంస్థ ప్రతినిధులు పి.వాసు, బి.గోవింద, పి.దాలమ్మ, గ్రామ పౌరులు బత్తుల రామలక్ష్మి, దిల్ షాద్ బేగం, పి.చంద్రమ్మ, చిర్రా అలివేలు, పి.శ్యామల తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి