శ్రీమహావిష్ణువు దగ్గర చింతామణి కోరికలు తీర్చే అపూర్వ మణి ఉంది.
దుర్జయుడనే రాజు వేటకెళ్లి అలసి గౌరముఖుడనే ముని కుటీరం చూశాడు.లోపలికి వచ్చిన రాజుని ఆదరంగా పలకరించి భోజన ఏర్పాట్లు చేయసాగాడు. కానీ రాజుతో వచ్చిన పరివారంకి ఎలా అన్నీ సమకూర్చాలి అనే చింతతో గంగాతీరానికెళ్లి హరిని స్తుతించాడు.ఆయన చింతామణిని మునికివ్వటంతో గౌరముఖుడు సకల ఏర్పాట్లు చేశాడు.రాజభవనాలు వనాలు విందు ఏర్పాట్లు పూర్తిఐనాయి చింతామణి ప్రభావంతో!రాజపరివారం భోజనం ముగిశాక నిద్ర పోయారు.రాత్రి ముగిసిపోతుండగా అన్నీ మాయం ఐనాయి. రాజు దుర్జయునికి దుష్ట తలంపు కలిగింది. అందుకే ప్రయాణంకి అందరినీ సిద్ధంచేసి తనమంత్రి విరోచనుని ముని దగ్గర కి పంపాడు చింతామణిని తనకుఅప్పగించమని! ఆయన నిరాకరించడంతో రాజుకి కోపంవచ్చి నీలుడనే మంత్రిని ససైన్యంగా పంపాడు మణిని బలవంతంగా తెమ్మన్నాడు. అగ్నిశాలలో ఉన్న చింతామణిని తీసుకోబోతుండగా అందులోంచి అస్త్రశస్త్రాలతో ఉన్న యోధులు వచ్చి మంత్రితో సహా అందర్నీ చంపేశారు.రాజు స్వయంగా తన మాయావి దైత్యులతో రావడం అంతా మణిప్రభావంతో చావటంతో గౌరమునికి బాగా దుఃఖం వచ్చింది.దుర్జయునితో సహా సుదర్శనచక్రం అందర్నీ బూడిద చేసింది.కనురెప్ప పాటులో జరిగింది విష్ణుకృపతో. అదే నైమిశారణ్యం. ఎంత శౌర్యప్రతాపం ఉన్నా రాజు దురాలోచన వల్ల నాశనమైనాడు. ముని ప్రార్ధనతో విష్ణుమూర్తి ఆచింతామణిని తన దగ్గరే ఉంచుకున్నాడు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి