ముందు తరాలెరుగుదురా?:- మీనుగ సునీత -హిందీ ఉపాధ్యాయురాలు -ఒంగోలు, ప్రకాశం జిల్లా
సాహితీ కెరటాలు 
సాహితీ కళా పీఠం 
================
కర్షక సామ్రాజ్యం ప్రమాదపుటంచులలో,
చిక్కుకుని ఉంది విషరాజకీయపు కోరలలో,
భూ మాత ఆసాంతం భూ బకాసురుల వలలో,
మిగిలేను నిరాశానిశ్పృహలు అలసిన కళ్ళల్లో.

నిలువెత్తు కురిసే నీటి ధారలతో గండమే,
కోలుకోలేని నష్టం తో గుండెల్లో అగాధమే,
భూమాతను విడువకుండుట వారికి మాత్రమే సాధ్యమే,
కన్నతల్లి, ఉన్న నేలే కర్షకుల సామ్రాజ్యమే.

ధరిత్రికి జీవన సూత్రమును కట్టిఉంచి,
అనుభవసారం తో అవాంతరాలను చేధించి,
ఆరుగాలం ఆగక అవిరామంగా కష్టించి,
పొట్ట కొచ్చిన పంటను చూసి ఆనందబాష్పాలు రాల్చు ‌.

మనుగడ సాగించలేక కర్షకుడౌతుండె కార్మికుడు,
భూములన్నీ మాయమౌతుండె యేటికాయేడు,
అన్నదాత గుండె కోత అంబరాలను   తాకుతుండె,
గింజ పండించేవారు లేక గిజ గిజలాడే రోజులు ముందుండె.



కామెంట్‌లు