కలలన్నీ స్థంభించి
కాలంతో కప్పబడి
సాకారం కోసం వేచి
వేసారి నిస్సహాయంగా....
చిన్న మార్పు కోసం
చిట్టి వెలుగుకోసం
కన్నులు కాయలయేలా
చీకటిలో ఎదురుచూసి...
రేపు నా కోసం వస్తుందని
మాపు అయినప్పటినుండి
చూపు దారిపై పరచి
ఓర్పు తో క్షణక్షణం గడిపే...
కాలపు గేలానికి చిక్కి
విడివడు మార్గం తెలియక
సుడిపడి గిరిగిరా తిరుగుతూ
విలవిలలాడుతూ వేడే
నిరాశ నిండిన గుండెకు
నిట్టూర్పుల ఓదార్పు నిస్తూ
తిమిరం తప్పే సమయం
తప్పక వస్తుందని ఆశ నింపుతూ..
చిక్కుముడులు విప్పుతూ
దిక్కులు వెలుగులతో నింపుతూ
మక్కువగా ఆదరించు
చక్కని వరమిచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి